లుక్ ఎలా ఉంది : ‘దబాంగ్-3’ షూటింగ్ స్టార్ట్

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 10:29 AM IST
లుక్ ఎలా ఉంది : ‘దబాంగ్-3’ షూటింగ్ స్టార్ట్

Updated On : April 1, 2019 / 10:29 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ‘దబాంగ్’ సిరీస్‌ను మరోసారి చేయనున్నాడు. 2010లో వచ్చిన దబాంగ్ 215 కోట్లు వసూల్ చేసి సల్మాన్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచింది. అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, ఆర్భాజ్ ఖాన్, సోనూ సూద్ ప్రధాన పాత్రలో నటించారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘దబాంగ్-2’ తీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్రిటిక్స్ మెప్పు పొందకపోయినా ఈ సినిమా దాదాపు 240 కోట్లు వసూల్ చేసింది. 
Read Also : సినిమా సెట్ కాదండీ : కొడ‌వ‌లి చేత‌బ‌ట్టిన హేమామాలినీ ​​​​​​​

ప్రస్తుతం సల్మాన్ ‘దబాంగ్-3’ సినిమానే చేయనున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాల్లో సల్మాన్ పాత్రతో సమానంగా విలన్ రోల్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దబాంగ్‌లో సోనూ సూద్ విలన్‌‌గా అద్భుతంగా నటించగా.. ‘దబాంగ్-2’లో నటుడు ప్రకాష్ రాజ్ తన మార్క్ విలనిజాన్ని పండించాడు. ఇప్పుడు ‘దబాంగ్-3’లో కూడా విలన్ పాత్ర కోసం అన్వేషించిన చిత్ర యూనిట్ ‘కిచ్చ’ సుదీప్ ను ఫైనల్ చేశారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ఇండోర్ లో స్టార్ట్ అయ్యింది. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు అర్బాజ్ ఖాన్ , సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం.. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షుకులముందుకు రానుంది. మరి హరీష్ ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ను ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి.
Read Also : ఈ ఏడాది 4 సినిమాలు రిలీజ్ చేయాలనేది చైతూ ప్లాన్