Damini : మూడు వారాలకు దామిని ఎంత సంపాదించిందో తెలుసా..? ఎలిమినేష‌న్‌కు అదే కార‌ణ‌మా..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో మూడు వారాలు ముగిశాయి. 14 మంది కంటెస్టెంట్ల‌తో షో ప్రారంభం కాగా.. వారానికి ఒక్కొక్క‌రు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ కావ‌డంతో ప్ర‌స్తుతం హౌస్‌లో 11 మంది ఉన్నారు.

Damini : మూడు వారాలకు దామిని ఎంత సంపాదించిందో తెలుసా..? ఎలిమినేష‌న్‌కు అదే కార‌ణ‌మా..?

Damini Bhatla

Damini Bhatla : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో మూడు వారాలు ముగిశాయి. 14 మంది కంటెస్టెంట్ల‌తో షో ప్రారంభం కాగా.. వారానికి ఒక్కొక్క‌రు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ కావ‌డంతో ప్ర‌స్తుతం హౌస్‌లో 11 మంది ఉన్నారు. మొద‌టి వారంలో కిర‌ణ్ రాథోడ్‌, రెండో వారంలో ష‌కీలా, మూడో వారంలో సింగ‌ర్ దామిని లు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అదే కార‌ణ‌మా..!

సింగ‌ర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది దామిని. పాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను బాగానే ఎంట‌ర్‌టైన్ చేసింది. అంద‌రికి అమ్మ‌లా వండిపెట్టింది. అయితే.. ఎక్కువ‌గా ఆమె కిచెన్ కే ప‌రిమితం కావ‌డంతో ఆట‌కు దూర‌మైంది. సేఫ్ గేమ్ ఆడుతోంది అంటూ మిగ‌తా కంటెస్టెంట్లు ఆమెను నామినేట్ చేశారు. మొత్తంగా పాట‌ల‌తో మెప్పించిన సింగ‌ర్‌.. ఆట‌లో, మాట‌లో మెప్పించ‌లేక‌పోయింది. ప్రిన్స్ యావ‌ర్‌కు ఇచ్చిన టాస్క్‌లో ఆమె చేసిన ప‌నుల వ‌ల్ల నెగెటివిటి ఎక్కువ అయ్యింది. దీంతో ఆమెకు ఓట్లు చాలా త‌క్కువ‌గా రావ‌డంతో హౌస్ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది.

రెమ్యున‌రేష‌న్ ఎంత‌..?

టాప్ 5 కంటెస్టెంట్‌గా దామిని ఉంటుంద‌ని చాలా మంది భావించారు. అయితే.. ఆమె మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. మూడు వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు ఆమె పెద్ద మొత్తంలోనే సంపాదించింది అంటూ టాక్. ఆమె వారానికి రూ.2ల‌క్ష‌ల మేర పారితోషికం అందుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ లెక్క‌న ఆమె రూ.6ల‌క్ష‌లు బిగ్‌బాస్ నుంచి రెమ్యున‌రేష‌న్‌గా అందుకున్న‌ట్లు తెలుస్తోంది.

Sivakarthikeyan : సౌత్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేసిన శివ కార్తికేయన్..