Deepika Padukone : పఠాన్‌కి ధీటుగా దీపికా..

షారూఖ్ ఖాన్, దీపికా లీడ్ రోల్స్ లో వార్ మూవీ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్లో భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో సూపర్ పవర్ ఫుల్ గా కనిపించబోతుంది దీపికా. తాజాగా చిత్ర యూనిట్.............

Deepika Padukone : పఠాన్‌కి ధీటుగా దీపికా..

Deepika

Updated On : July 26, 2022 / 11:22 AM IST

Deepika Padukone :  జనరల్ గా విమెన్ ఓరియంటెడ్ సినిమాలు చెయ్యడం స్టార్ట్ చేశాక కమర్షియల్ గ్లామర్ రోల్స్ చెయ్యడం తగ్గించేస్తారు హీరోయిన్లు. కానీ దీపికా పదుకొనే మాత్రం అలా కాదు. అటు విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ మరో వైపు షారూఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో జతకడుతోంది. ఇంత పెద్ద స్టార్ హీరో ఉంటే దీపికా జస్ట్ గ్లామర్ హీరోయిన్ గానే ఉంటుందేమో అనుకున్న ఫాన్స్ కి పవర్ ఫుల్ వీడియోతో క్లారిటీ ఇచ్చింది దీపికా.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫుల్ క్లారిటీ తోనే ఉంది. ఏ సినిమా చేసినా అల్టిమేట్ ఇంపార్టెన్స్ ఉండాలనుకుంటోంది. అందుకే మొన్న మొన్నటి వరకూ బాజీ రావ్ మస్తానీ, పద్మావత్, పీకు.. లాంటి విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన దీపికా ఇక ఇలాంటి సబ్జెక్ట్ లకే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ కే ఫిక్స్ అయిపోతుందనుకున్నారు అందరూ. కానీ దీపిక మాత్రం పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ తో ఫైటింగ్స్ చెయ్యడానికి రెడీ అయ్యింది.

Allu Arjun : ఐకాన్ స్టార్ ఒక్క ఫొటోతో.. ‘పుష్ప’పై ఎన్నో అనుమానాలు..

దీపికా పదుకొనే ఇలాగే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది. షారూఖ్ ఖాన్, దీపికా లీడ్ రోల్స్ లో వార్ మూవీ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్లో భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో సూపర్ పవర్ ఫుల్ గా కనిపించబోతుంది దీపికా. తాజాగా చిత్ర యూనిట్ దీపికా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా స్టాప్, స్టేర్, షూట్ అంటూ బుల్లెట్ అంత ఫాస్ట్ గా, అగ్రెసివ్ గా రూత్ లెస్ గా కనిపిస్తోంది దీపికా పదుకొనే. లేటెస్ట్ గా పఠాన్ టీమ్ రిలీజ్ చేసిన దీపికా గ్లింప్స్ వీడియోలో దీపికా చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు అర్థమైపోతుంది. ఈ సినిమాతో షారుఖ్ మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. జనవరి 25, 2023లో పఠాన్ సినిమాని పాన్ ఇండియా విడుదల చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Yash Raj Films (@yrf)