Deepika Padukone: జవాన్ కోసం ‘స్పెషల్’గా వస్తోన్న పఠాన్ బ్యూటీ..?
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె ఇటీవల షారుక్ ఖాన్ సరసన ‘పఠాన్’ మూవీలో నటించింది. ఇప్పుడు ‘జవాన్’ సినిమాలో షారుక్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులు వేయనుంది.

Deepika Padukone In Special Song For Shah Rukh Khan Jawan Movie
Deepika Padukone: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇటీవల పఠాన్ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ సినిమాలో షారుక్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో అందాల భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించగా.. షారుక్‌తో ఆమె కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందంటూ ప్రేక్షకులు ఈ జంటపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బేషరమ్ సాంగ్‌లో అయితే వీరు రెచ్చిపోయారని చెప్పాలి. పఠాన్ సక్సెస్‌లో దీపికా కూడా తనవంతు పాత్రను పోషించింది.
Deepika Padukone : మొన్న కాన్స్.. నేడు ఆస్కార్.. ఆస్కార్ అవార్డు ప్రజెంటర్స్ లో దీపికా..
అయితే, ఇప్పుడు దీపికాను మరోసారి తన సినిమాలో తీసుకుంటున్నాడట కింగ్ ఖాన్. షారుక్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా సౌత్ స్టార్ బ్యూటీ నయనతార నటిస్తోంది. కాగా, తనకు ఎంతో కలిసొచ్చిన దీపికాను ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో పెట్టేందుకు షారుక్ ప్రయత్నిస్తున్నాడు.
Deepika Padukone : ఖతార్ ఎయిర్‌వేస్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరోయిన్..
షారుక్‌తో కలిసి ఈ స్పెషల్ సాంగ్‌లో దీపికా చిందులు వేయనుంది. ఇక ఈ సాంగ్‌లో మరోసారి వీరిద్దరు కలిసి రెచ్చిపోవడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అట్లీ తెరకెక్కిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.