Deepika Padukone – Ranveer Singh : కూతురు పేరు ప్రకటించిన దీపికా పదుకోన్ – రణవీర్ సింగ్.. పేరు, దాని అర్ధం ఏంటో తెలుసా?

దీపికా పదుకోన్ తన సోషల్ మీడియాలో తన కూతురు పాదాల ఫోటో షేర్ చేసి..

Deepika Padukone – Ranveer Singh : కూతురు పేరు ప్రకటించిన దీపికా పదుకోన్ – రణవీర్ సింగ్.. పేరు, దాని అర్ధం ఏంటో తెలుసా?

Deepika padukone Ranveer Singh Daughter Name Announced

Updated On : November 2, 2024 / 10:37 AM IST

Deepika Padukone – Ranveer Singh : బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకోన్, రణవీర్ ప్రేమించుకొని 2018 లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు గత నెల సెప్టెంబర్ లో ఓ పాప పుట్టింది. దీంతో ఫ్యాన్స్, బాలీవుడ్ దీపికా – రణవీర్ పాపకు ఏం పేరు పెడతారు, ఆ పాపను ఎప్పుడు చూపిస్తారు అని ఎదురుచూస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా దీపికా పదుకోన్ తమ కూతురు పేరు ప్రకటించింది.

Also Read : Lucky Baskhar Collections : ‘లక్కీ భాస్కర్’ రెండు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే.. దుల్కర్ కల నెరవేరుతుందా..?

దీపికా పదుకోన్ తన సోషల్ మీడియాలో తన కూతురు పాదాల ఫోటో షేర్ చేసి.. దువా పదుకోన్ సింగ్ అని తన కూతురు పేరుని ప్రకటించింది. అలాగే దువా అంటే ప్రార్థన అని, మా ప్రార్థనలకు ప్రతిరూపంగా పుట్టినందుకు ఆ పేరు పెట్టామని తెలిపింది దీపిక. ఇక దువా పక్కన తల్లితండ్రుల పేర్లలోంచి పదుకోన్, సింగ్ జత చేసి తమ కూతురికి దువా పదుకోన్ సింగ్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.