Deepika Padukone : పెళ్లి జీవితం బాగుండాలంటే వాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకోవాలి.. దీపికా పదుకొనే వ్యాఖ్యలు..

దీపికా, రణవీర్ తమ మద్య ఉన్న స్వీట్ రిలేషన్ ని పబ్లిక్ గా ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి ఎప్పుడూ హెజిటేట్ చెయ్యరు. ఈ ముచ్చటైన జంటను చూసి తెగ మురిసిపోతుంటారు ప్యాన్స్. ఇదంతా జస్ట్ ఒకే ఒక ఫార్ములాతోనే సాధ్యమైందంటోంది దీపికా.

Deepika Padukone : పెళ్లి జీవితం బాగుండాలంటే వాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకోవాలి.. దీపికా పదుకొనే వ్యాఖ్యలు..

Deepika Padukone suggestions for happy life after marriage

Updated On : May 12, 2023 / 10:12 AM IST

Deepika Padukone :  బాలీవుడ్(Bollywood) లో మోస్ట్ హాట్ అండ్ లవబుల్ కపుల్ గా పేరుతెచ్చుకున్నారు దీపికా పదుకొనే(Deepika Padukone), రణవీర్ సింగ్(Ranveer Singh). దాదాపు 10 ఏళ్ల తమ ప్రేమని పదిలంగా అలాగే చూసుకుంటున్నారు ఈ ఇద్దరూ. ఎంత ప్రేమించి పెళ్లి చేసకున్నా ఈ మధ్య కాలంలో పెళ్లైన కొంత కాలానికే విడిపోతున్నారు చాలా మంది సెలబ్రిటీలు. కానీ దీపికా, రణవీర్ మాత్రం లైఫ్ ని లవబుల్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ పబ్లిక్ గా అంత ఎఫెక్షనేట్ గా ప్రేమగా ఎలా ఉంటారో అని అందరూ తెగ ఆశ్చర్యపోతారు. తాజాగా దీనికి కారణం ఏంటో, తమ పండంటి కాపురానికి ఫాలో అయిన ఫార్ములాని రివీల్ చేసింది దీపికా.

దీపికా, రణవీర్ తమ మద్య ఉన్న స్వీట్ రిలేషన్ ని పబ్లిక్ గా ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి ఎప్పుడూ హెజిటేట్ చెయ్యరు. ఈ ముచ్చటైన జంటను చూసి తెగ మురిసిపోతుంటారు ప్యాన్స్. ఇదంతా జస్ట్ ఒకే ఒక ఫార్ములాతోనే సాధ్యమైందంటోంది దీపికా. పేషెన్స్.. ఈ ఒక్క ఫార్ములాని ఫాలో అయితే లైఫ్ చాలా ఈజీగా ఉంటుందని, ఓపిగ్గా పార్టనర్ ని అర్దం చేస్కోవాలని, ఆ స్పేస్ ఇవ్వాలని, అది అలవాటైతే మ్యారీడ్ లైఫ్ సూపర్ హిట్ అయినట్టే అంటోంది దీపికా. లైఫ్ హ్యాపీగా ఉండాలంటే చాలా అవసరం, కానీ వాటిలో ముఖ్యమైనది మాత్రం పేషెన్సే అని క్లియర్ గా చెబుతోంది దీపికా.

Alia Bhatt : ఇంటర్నేషనల్ బ్రాండ్ గూచీకి ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్

మన పూర్వీకులు ఫాలో అయిన ఈ ఓపిక అనే చిన్నమాటని మనం కూడా ఫాలో అయితే వాళ్లలా మంచి జీవితాన్ని లీడ్ చెయ్యొచ్చని సలహా చెబుతోంది దీపికా. మన పెద్దవాళ్ళు పెళ్లి అయినా తర్వాత రిలేషన్ లో ఎంతో ఓపికగా ఉంటారు కాబట్టే వారి బంధాలు ఇప్పటికి ధృడంగా ఉన్నాయి అని అంటోంది దీపికా. చిన్న చిన్న గొడవలు, అనుమానాలకు విడిపోయే ఈ రోజుల్లో మన ఫ్యామిలీ సిస్టమ్ ని అర్ధం చేసుకొని లైఫ్ లాంగ్ ఎన్ని గొడవలొచ్చినా కలిసే ఉంటాం అని దీపికా పదుకొనే చెప్తుండటంతో అంతా ఆమెను అభినందిస్తున్నారు. దీపికా, రణవీర్ ఇద్దరూ కూడా తమ సినిమాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు.