Alia Bhatt : ఇంటర్నేషనల్ బ్రాండ్ గూచీకి ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్

తాజాగా అలియాభట్ ఇంటర్నేషనల్ ప్రముఖ బ్రాండ్ గూచీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. గూచీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దుస్తులు, షూస్, వాచెస్, బ్యాగ్స్, ఆర్నమెంట్స్.. ఇలా పలు ఉత్పత్తులని బిజినెస్ చేస్తుంది. వీటికి ఇండియాలో కూడా మంచి ఆదరణ ఉంది.

Alia Bhatt : ఇంటర్నేషనల్ బ్రాండ్ గూచీకి ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్

Alia Bhatt is the first Indian brand ambassador for Gucci Brand

Alia Bhatt :  ఇటీవల మన ఇండియన్ సినిమాలు(Indian Movies), ఇండియన్ సెలబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మీడియా మన హీరోలతో, హీరోయిన్స్ తో ఇంటర్వ్యూల కోసం ట్రై చేస్తున్నారు. మన సెలబ్రిటీలతో తమ బ్రాండ్స్ ని ప్రమోషన్ చేయించాలనుకుంటున్నారు. ఇటీవల పలు ఇంటర్నేషనల్ బిజినెస్(Business) బ్రాండ్స్ ఇండియన్ సెలబ్రిటీలతో తమ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయిస్తున్నారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా, కొన్ని రోజుల క్రితం రష్మిక.. ఇలా పలువురు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేరింది.

తాజాగా అలియాభట్ ఇంటర్నేషనల్ ప్రముఖ బ్రాండ్ గూచీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. గూచీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దుస్తులు, షూస్, వాచెస్, బ్యాగ్స్, ఆర్నమెంట్స్.. ఇలా పలు ఉత్పత్తులని బిజినెస్ చేస్తుంది. వీటికి ఇండియాలో కూడా మంచి ఆదరణ ఉంది. టాప్ బ్రాండ్స్ లో గూచీ ఒకటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా గూచీ తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ ని నియమించింది.

అలియా భట్, గూచీ స్వయంగా ఈ విషయం తమ సోషల్ మెయిల్ ద్వారా తెలిపారు. గూచీకి సంబంధించిన డ్రెస్, బ్యాగ్ ధరించిన ఫోటోలు పోస్ట్ చేసి అలియా భట్.. నేను ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గూచీకి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. గూచీ నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తుంది, ఆసక్తిని కలిగిస్తుంది. నేను, గూచీ కలిసి మరిన్ని అద్భుతమైనవి సృష్టించాలని అనుకుంటున్నాను అని తెలిపింది. ఇక గూచీ కంపెనీ తన సోషల్ మీడియాలో.. అలియా భట్ గూచీ హౌస్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్. గూచీ ఉత్పత్తులతో పోజులిస్తుంది అని అలియా భట్ ఫోటోలని పోస్ట్ చేసింది.

Prithviraj Sukumaran : తప్పుడు వార్తలు రాసినందుకు… యూట్యూబ్ ఛానల్ పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్న స్టార్ హీరో..

అలియాభట్ ఇలా ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉండటంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నారు. ఇక అలియా భట్ గూచికి సంబంధించిన పలు ప్రోడక్ట్స్ తో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసింది.