NTR : ‘మీరు ఓటు వేయరా..?’ అంటూ ఎన్టీఆర్ ప్రశ్న.. వెయ్యమంటూ బదులిచ్చిన వ్యక్తి.. వీడియో వైరల్..
తన ఓటు హక్కుని ఉపయోగించుకోవడానికి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక వ్యక్తి ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.

Devara star NTR question to stranger about vote video gone viral
NTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెల్లవారుజాము నుంచే సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కీరవాణి, తేజ, శివాజీ రాజా, సుమంత్.. ఇలా ఒక్కొక్కరిగా తమ ఓటుని వేసి వస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి షాలిని, సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి వచ్చి ఓటు వేశారు. సాధారణ ప్రజలతో పాటు తాను కూడా లైన్ లో నిలబడి వెళ్లి తమ ఓటుని వేసి వచ్చారు.
ఈక్రమంలోనే పోలింగ్ బూత్ వద్ద లైన్ నిలబడిన ఎన్టీఆర్ ని ఫోటోలు, వీడియోలు తీస్తూ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తులు ఉన్నారు. ఇక వారితో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “మీరు ఓటు వేయరా.. ఇక్కడే ఉంటారా..?” అంటూ ప్రశ్నించారు. దీనికి ఒక వ్యక్తి బదులిస్తూ.. “మీరు ఓటు వేసిన తరువాత వేస్తాము. అయితే అందరూ వేయము సగమే మందే వేస్తాము” అంటూ బదులిచ్చారు. అది విన్నా ఎన్టీఆర్.. ‘సగం మంది వెయ్యరా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also read : Celebrities Vote Cast : ఓటు హక్కు ఉపయోగించుకుంటున్న సెలబ్రిటీస్.. అప్డేట్స్ ఇవే..
View this post on Instagram
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్.. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వార్ 2 మూవీ రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఆయన ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 2025 ఆగష్టు 14న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు.