బండ్ల గణేశ్‌తో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్
మ్యూజిక్ షోలను ఎక్కువగా విదేశాల్లో నిర్వహించడాన్ని చూస్తూనే ఉంటాం.

Devi Sri Prasad met CM Revanth Reddy
మ్యూజిక్ షోలను ఎక్కువగా విదేశాల్లో నిర్వహించడాన్ని చూస్తూనే ఉంటాం. ఆయా ఈవెంట్లలో సింగర్స్, పాప్ సింగర్స్ పాడే పాటలకు జనాల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఇక మన దేశంలో ఇలాంటి ఈవెంట్‌లు కాస్త తక్కువనే చెప్పాలి. అయితే.. తెలుగు ప్రేక్షకుల కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హైదరాబాద్‌లో లైవ్ షోలో ఫెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు. ఈ నెల 19న ఈ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది.
ఈ వెంట్‌కు పలువురు ముఖ్య అతిథులు వస్తారని ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయన్నుఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దేవిశ్రీ ప్రసాద్. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలను మర్యాద పూర్వకంగా కలిశారు. 19న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ కు హాజరు కావాలని కోరారు. దేవిశ్రీ ప్రసాద్ వెంట బండ్ల గణేశ్ ఉన్నారు.
Samantha : సిటాడెల్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సమంత ఫోటోలు చూశారా?
ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను ఇప్పటికే నిర్వాహకులు విక్రయించారు.