Dhanya Balakrishna : డైరెక్టర్‌ని సీక్రెట్‌గా పెళ్లాడిన ధన్య బాలకృష్ణ..
సినీ నటి ధన్య బాలకృష్ణ ప్రముఖ దర్శకుడిని రహస్యగా ప్రేమ వివాహం చేసుకుంది. గతంలో ఈ విషయాన్ని టాలీవుడ్ లోని మరో నటి కల్పిక గణేష్ తన యూట్యూబ్ ద్వారా బయటపెట్టింది. ఇప్పుడు ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ ధ్రువీకరించాడు. వీరిద్దరూ 2020 జనవరిలోనే వివాహం చేసుకున్నట్లు వెల్లడించాడు.

Dhanya Balakrishna secretly married the director
Dhanya Balakrishna : సినీ నటి ధన్య బాలకృష్ణ ప్రముఖ దర్శకుడిని రహస్యగా ప్రేమ వివాహం చేసుకుంది. 7 సెన్స్ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన ఈ భామ సౌత్ లోని అన్ని భాషల్లో సినిమా ఛాన్సులు అందుకుంటూ ముందుకు సాగుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా నటిస్తున్న ధన్య తెలుగులో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘రాజు గారి గది’, ‘నేను శైలజ’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Unstoppable 2: అన్‌స్టాపబుల్-2 బాహుబలి ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో.. అదిరిపోయింది!
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. కాగా ఈ భామ తమిళ స్టార్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ని రహస్య వివాహం చేసుకుంది అన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ విషయాన్ని టాలీవుడ్ లోని మరో నటి కల్పిక గణేష్ తన యూట్యూబ్ ద్వారా బయటపెట్టింది. ఇప్పుడు ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ ధ్రువీకరించాడు. వీరిద్దరూ 2020 జనవరిలోనే వివాహం చేసుకున్నట్లు వెల్లడించాడు.
నటి కల్పిక, ఆమె యూట్యూబ్ ఛానల్‌లో.. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కోర్ట్ లో పిర్యాదు చేసిన బాలాజీ, ధన్యతో వివాహాన్ని కూడా బయటపెట్టాడు. అయితే ఈ దర్శకుడికి ఇది రెండో వివాహం. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ దర్శకుడు.. ధనుష్ మారి-1, మారి-2 సినిమాలను తెరకెక్కించాడు. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన మొదటి మూవీ ‘లవ్ ఫెయిల్యూర్’ ధన్య బాలకృష్ణకి రెండో సినిమా. వీరిద్దరికి ఆ సమయంలోనే పరిచయం అయ్యినట్లు తెలుస్తుంది.