Dil Raju : నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. నేను తెలంగాణ వాడినే.. దిల్ రాజు కామెంట్స్..

దిల్ రాజు ఇటీవల తనపై వస్తున్న అన్ని విమర్శలకు సమాధానమిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

Dil Raju : నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. నేను తెలంగాణ వాడినే.. దిల్ రాజు కామెంట్స్..

Dil Raju Gives Clarity On FDC and Nizamabad Event Issues

Updated On : January 11, 2025 / 2:55 PM IST

Dil Raju : ఇన్నాళ్లు సినిమాలతో వైరల్ అయిన దిల్ రాజు ఇటీవల రాజకీయాలతో కూడా వైరల్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజుని నియమించడం, టాలీవుడ్ తరపున మీటింగ్ పెట్టి సీఎంని అందరితో వెళ్లి కలవడం, ఆ మీటింగ్ గురించి మాట్లాడటం, సంక్రాంతి రెండు సినిమాలకు ఆయనే నిర్మాత కావడం, మూడు సినిమాలను ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయడం.. ఇలా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు దిల్ రాజు పై కూడా కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో నిర్వహించగా ఆంధ్ర వాళ్ళు సినిమాలకు వైబ్ అవుతారు. మన తెలంగాణలో కళ్ళు, మటన్ కి వైబ్ అవుతారు అని దిల్ రాజు అన్నారు. అయితే దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు నెగిటివ్ గా అర్ధం చేసుకొని దిల్ రాజుపై విమర్శలు చేసారు. దీంతో దిల్ రాజు ఇటీవల తనపై వస్తున్న అన్ని విమర్శలకు సమాధానమిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

Also Read : Allu Arjun : కోర్టులో అల్లు అర్జున్‌కు ఊర‌ట‌.. విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి..

ఈ వీడియోలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. FDC రాజకీయాలకు వేదిక కాదు. FDC సినిమాలకు మాత్రమే ఉపయోగపడేలా చేస్తాం. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా FDC ఛైర్మన్ అయ్యాను. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడేలా FDCని తీర్చిదిద్దుతాను అని అన్నారు.

నిజామాబాద్ ఈవెంట్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా వాసిగా నా సినిమా ఈవెంట్ అక్కడ చేశాను. నిజామాబాద్ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్స్ జరగవు. ఆ ఈవెంట్ లో నేను మన సంస్కృతిలో ఉండే దావత్ తెల్లకల్లు, మటన్ గురించి మాట్లాడాను. తెలంగాణ వాళ్లను నేను అవమానించానని, హేళన చేశానని సోషల్ మీడియాలో కొంతమంది పెట్టారు. సంక్రాంతికి రెండు సినిమాలు విడుదలవుతుండటం వల్ల నేను తెలంగాణ దావత్ ను మిస్ అవుతున్నానని, సినిమా రిలీజ్ అయ్యాక తెలంగాణ దావత్ చేసుకుంటానని చెప్పాను. నా మాటలను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొందరు రాద్దాంతం చేస్తున్నారు. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తాను. బాన్సువాడలోనే ఫిదా సినిమాని తీశాను. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని ఫిదా సినిమా తీసుకెళ్లింది. బలగం సినిమా తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. తెలంగాణ ప్రజలు మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బలగం సినిమాని అభినందించారు. తెలంగాణ వాసిని అయిన నేను తెలంగాణను ఎలా హేళన చేస్తాను. నా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణలు అని తెలిపారు దిల్ రాజు.

ఇక ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజే నిర్మించారు. డాకు మహారాజ్ సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో ఈ సంక్రాంతి మొత్తం దిల్ రాజుదే.

Also See : Daaku Maharaaj Making Video : డాకు మ‌హారాజ్ మేకింగ్ వీడియో చూశారా?