NTR – Dil Raju : ఎన్టీఆర్ ని దిల్ రాజు ఏమని పిలుస్తాడో తెలుసా? కొడాలి నాని పిలవడం చూసి..

ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన రాగా దిల్ రాజు మాట్లాడుతూ..

NTR – Dil Raju : ఎన్టీఆర్ ని దిల్ రాజు ఏమని పిలుస్తాడో తెలుసా? కొడాలి నాని పిలవడం చూసి..

Dil Raju Interesting Comments on NTR

Updated On : June 30, 2025 / 7:36 PM IST

NTR – Dil Raju : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆల్మోస్ట్ అందరు హీరోలతో సినిమాలు చేసారు. హీరోలందరితో దిల్ రాజుకి మంచి సంబంధాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన నితిన్ తమ్ముడు సినిమా జులై 4న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు – నితిన్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

ఈ ఇంటర్వ్యూలో నితిన్ వేరే హీరోల గురించి మీకున్న అనుబంధం చెప్పమని దిల్ రాజు ని అడిగాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన రాగా దిల్ రాజు మాట్లాడుతూ.. తారక్ ని నేను నాన్న అని పిలుస్తాను. మా ఇద్దరి బంధం అలాంటిది. బృందావనం సినిమా చేస్తున్నప్పుడు కొడాలి నాని ఎన్టీఆర్ ని నాన్న అని పిలుస్తుంటే అది చూసి నాకు అలా నచ్చి నేను కూడా అలా పిలవడం మొదలుపెట్టాను. ఎన్టీఆర్ నన్ను అన్న అని పిలుస్తాడు అని తెలిపారు.

Also Read : Kannappa : డిప్యూటీ సీఎంతో మోహన్ బాబు – మంచు విష్ణు.. కన్నప్ప స్పెషల్ షో ఫొటోలు..

దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ గతంలో బృందావనం, రామయ్య వస్తావయ్యా సినిమాలు చేసాడు.