తారక్‌తో సినిమా లాంగ్ టైమ్ డ్రీమ్ : డైరెక్టర్ అట్లీ
‘విజిల్’ మూవీ ప్రెస్‌మీట్‌లో త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు దర్శకుడు అట్లీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న సినిమా విడుదల కానుంది..

‘విజిల్’ మూవీ ప్రెస్‌మీట్‌లో త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు దర్శకుడు అట్లీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న సినిమా విడుదల కానుంది..
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బిగిల్’.. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చెయ్యడానికి రెడీ అయిపోయింది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో, స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘బిగిల్’లో విజయ్ రాజప్ప, మైఖేల్‌గా ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార హీరోయిన్.. ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది.
118 నిర్మాత మహేష్ కోనేరు ‘బిగిల్’ నిర్మాతలతో కలిసి తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. దిల్ రాజు నైజాంలో పంపిణీ చేస్తున్నాడు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు అట్లీ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. ‘తెలుగులో సినిమా చేయాలనేది తన లాంగ్ టైమ్ డ్రీమ్ అని చెప్పిన అట్లీ.. తన ప్రతి సినిమా రిలీజ్‌కి ఎన్టీఆర్ కాల్ చేసి.. సినిమా బాగుందని, తన వర్క్ బాగుందని చెప్తారని చెప్పాడు.మొత్తానికి ఈ ప్రెస్‌మీట్ ద్వారా త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు అట్లీ..
దీపావళి కానుకగా బిగిల్ / విజిల్ అక్టోబర్ 25న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : అర్చన కల్పతి, నిర్మాతలు : కల్పతి ఎస్.అఘోరం, కల్పతి ఎస్.గణేష్, కల్పతి ఎస్.సురేష్.