NBK109 : బాలయ్య మూవీ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. రాజస్థాన్‌లో నెక్స్ట్ షెడ్యూల్..

దర్శకుడు బాబీ బాలయ్యతో చేస్తున్న NBK109 అప్డేట్ ని ఇచ్చారు. ఊటీలో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసిన మూవీ టీం..

NBK109 : బాలయ్య మూవీ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. రాజస్థాన్‌లో నెక్స్ట్ షెడ్యూల్..

Director Bobby gave update on Nandamuri Balakrishna NBK109

Updated On : December 25, 2023 / 1:48 PM IST

NBK109 : అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకుంటూ ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలకృష్ణ.. ప్రస్తుతం బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. మూవీలోని భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. దాదాపు 20 రోజులు పాటు ఊటీలో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన న్యూస్ ని బాబీ తెలియజేశారు.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్ లో జరగబోతుందట. అక్కడ కూడా ఒక అదిరిపోయే యాక్షన్ షెడ్యూల్ ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుందని బాబీ చెప్పుకొచ్చారు. జనవరి నుంచి ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు వస్తాయంటూ తెలియజేశారు. కాగా రాజస్థాన్ షెడ్యూల్ ని సంక్రాంతి తరువాత మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది.

Also read : Salaar : సలార్ మేకింగ్ వీడియో చూశారా..? అవి అన్ని గ్రాఫిక్స్ కాదా..!

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1980 స్టోరీతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ సినిమాని ప్రకటించారు. ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో ఫస్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి పని చేయబోతున్నారట.

అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరు చేయబోతున్నారు, అలాగే ఇతర మూవీ క్యాస్ట్ గురించి కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. దర్శకుడు బాబు ఈ ఏడాది చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి బాబీ ఆ అంచనాలు రీచ్ అయ్యి.. మెగా అభిమానులను ఖుషి చేసినట్లు, నందమూరి అభిమానుల కూడా ఖుషి చేస్తారేమో చూడాలి.