Karthik Dandu : నేను కడుపులో ఉన్నప్పుడు కాష్మోరా కథలు చదివి మా అమ్మ ఇలా పెంచింది.. చిన్నప్పట్నుంచి హారర్ సినిమాలు ఇష్టం..

విరూపాక్ష సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Karthik Dandu : నేను కడుపులో ఉన్నప్పుడు కాష్మోరా కథలు చదివి మా అమ్మ ఇలా పెంచింది.. చిన్నప్పట్నుంచి హారర్ సినిమాలు ఇష్టం..

Director Karthik Dandu speech in Virupaksha Pre Release Event

Updated On : April 17, 2023 / 7:23 AM IST

Karthik Dandu :  మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తో రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష(Virupaksha) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన విరూపాక్ష సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ.. తేజ్ వాళ్ళ అమ్మ గారి గురించి మాట్లాడాలి. ఆమె ఒక మంచితనం ఇచ్చింది మాకు తేజ్ గారి రూపంలో. అందరితో చాలా బాగుంటారు, సరదాగా, గౌరవం ఇస్తూ ఉంటారు. ప్రతి డైరెక్టర్ కి ఒక మంచి అవకాశం వస్తుంది. ఒక హీరోకి పాత్ బ్రేకింగ్ సినిమా ఇచ్చే ఛాన్స్ వస్తుంది. ఈ సినిమాతో సాయి గారికి అలాంటి సినిమా ఇచ్చాను. పవన్ గారు టీజర్ చూసి నన్ను పిలిచి అభినందించారు. పవన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడుతూనే వెళ్ళాను. తేజ్ గారు కూడా అదే పొజిషన్ లో ఉన్నారు. ఇందులో ఉన్న విలేజ్ మొత్తం సెట్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్. ఇప్పటికి నా చెవిలో వినిపిస్తూనే ఉంది. అందరూ కెమెరా వర్క్ గురించే మాట్లాడుతున్నారు అని తెలిపారు.

Sukumar : సాయినే కాదు ఈ సినిమా డైరెక్టర్ కూడా చచ్చిపోయే స్థితిలోంచి బయటకి వచ్చి ఈ సినిమా చేశాడు..

హారర్ సినిమాల గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాకు హారర్ సినిమాలు ఇష్టం. ఈ సినిమాతో ఆ జోనర్ కి న్యాయం చేశాను అనుకుంటున్నాను. మా అమ్మ గారి దగ్గరి నుంచి ఈ హారర్ కథలు నేర్చుకున్నాను. ట్రైలర్ చూసి అందరూ నన్నుఅభినందిస్తుంటే మా అమ్మ కాల్ చేసి.. ఇదంతా నీ ఘనత కాదు, నాది. నువ్వు కడుపులో ఉన్నప్పుడు కాష్మోరా కథలు చదివాను. హారర్ కథలు అక్కడనుంచే నీకు వచ్చాయి అని చెప్పింది. ఈ సినిమా చూశాక అందరూ నా గురించి మాట్లాడతారు అనుకుంటున్నాను అని అన్నారు.