Sandeep Reddy Vanga: అమ్మాయి వెంటపడ్డ సందీప్.. సైకిల్ మీద సర్కస్ ఫీట్లు.. అంతా చేస్తే చివరికి పాపం..
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా(Sandeep Reddy Vanga) చెప్పల్సిన పనిలేదు. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
 
                            Director Sandeep Reddy Vanga talks about his first love
Sandeep Reddy Vanga: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా (Sandeep Reddy Vanga)చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ గా కనిపిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే, సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ఈ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ క్రాంతి సందీప్ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు.
Kriti Sanon: ఎద అందాలతో ఎర వేస్తున్న కృతి సనన్.. ఫోటోలు
ఈ విషయం గురించి క్రాంతి మాట్లాడుతూ..”5వ తరగతిలో ఉన్నప్పుడు సందీప్ ఒక అమ్మాయి వెంటపడేవాడు. స్కూల్ అయిపోయాక రోజు ఆ అమ్మయి రిక్షాలో వెళుతుంటే సందీప్ సైకిల్ పై వెనకాల వెళ్ళేవాడు. అలా ఒకరు రోజు సందీప్ నాకు చెప్పకుండా ఆ అమ్మయి వెనకాల వెళ్ళాడు కానీ, సైకిల్ పై నుంచి కిందపడ్డాడు. అది చూసి అమ్మాయి చాలా నవ్వింది. ఆ అమ్మాయి నవ్వడం చూసి సందీప్ బాధపడతాడేమో అనుకున్న. కానీ, లేచి మళ్ళీ సైకిల్ ఎక్కి ఆ అమ్మాయి ముందు సైకిల్ హ్యాండిల్ విడిచి పెట్టి తొక్కుతూ సర్కార్ ఫీట్లు చేశాడు. అలా సందీప్ యాటిట్యూడ్ కి ఆ అమ్మయి ఫిదా అయ్యింది”అంటూ చెప్పుకొచ్చాడు క్రాంతి.
దానికి బదులుగా సందీప్ స్పందిస్తూ.. అవును క్రాంతి చెప్పింది నిజమే. ఆరోజుల్లో అలా చేశాను అంటూ నవ్వుతు” చెప్పుకొచ్చాడు సందీప్. ప్రస్తుతం సందీప్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ కి నెటిజన్స్ కూడా ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు… అవును నిజమే సందీప్ కి యాటిటైడ్ ఎక్కువ. అది ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. 5వ తరగతిలోనే ఆ రేంజ్ లో మైంటైన్ చేశావంటే నువ్వు తోపు అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






