Aditi Shankar : స్టార్ డైరెక్టర్ కూతురు వరుణ్ తేజ్ సినిమాతో సింగర్‌గా ఎంట్రీ

ప్రముఖ దర్శకుడు శంకర్‌ చిన్న కుమార్తె అదితి శంకర్ ఇటీవల హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో కార్తి సరసన అదితి హీరోయిన్ గా నటిస్తున్న తమిళ్ సినిమా ప్రస్తుతం......

Aditi Shankar :  స్టార్ డైరెక్టర్ కూతురు వరుణ్ తేజ్ సినిమాతో సింగర్‌గా ఎంట్రీ

Aditi Shankar

Updated On : February 8, 2022 / 8:58 AM IST

Aditi Shankar :  ప్రముఖ దర్శకుడు శంకర్‌ చిన్న కుమార్తె అదితి శంకర్ ఇటీవల హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో కార్తి సరసన అదితి హీరోయిన్ గా నటిస్తున్న తమిళ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. ఈ సినిమాతో అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే అంతకంటే ముందే సింగర్ గా ఎంట్రీ ఇస్తుంది అదితి.

 

అదితి చదివింది డాక్టర్ అయినా సింగర్ గా, యాక్టర్ గా ఇలా తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ‘గని’ చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్‌ ఇవాళ రిలీజ్ అవ్వనుంది. ఈ సాంగ్ లిరికల్ ప్రోమోని నిన్న విడుదల చేశారు. ఈ సాంగ్ ని శంకర్ కుమార్తె అదితి శంకర్ పాడింది. తనకి ఇదే మొదటి సాంగ్. తన మొదటి సాంగ్ తెలుగులో పాడటం విశేషం.

Nanditha Swethaa : ఆంటీలా ఉన్నావు అన్న నెటిజన్.. కౌంటర్ ఇచ్చిన నందిత శ్వేతా..

దీని గురించి అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ”నా సింగింగ్ డెబ్యూ.. మీ అందరికి షేర్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నా మరో కల నెరవేరనుంది. తమన్ సర్ కి చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి ఈ అవకాశం నాకు ఇచ్చారు. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.” అని తెలిపింది. మొత్తానికి స్టార్ డైరెక్టర్ కూతురు అయినా తన అన్ని రకాల ట్యాలెంట్స్ చూపిస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి బాగానే కష్టపడుతుంది.