Ram Charan : రామ్‌చరణ్ సినిమా అయితేనే థియేటర్‌కి వెళ్తా.. ఆ మూవీ నుంచి తనకి ఫ్యాన్ అయ్యిపోయా.. తేజ!
అహింస మూవీ ప్రమోషన్స్ లో ఉన్న డైరెక్టర్ తేజ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి జనరేషన్ లో రామ్ చరణ్..

Director Teja comments on Ram Charan at Ahimsa promotions
Ram Charan – Teja : టాలీవుడ్ దర్శకుడు తేజ ప్రస్తుతం అహింస (Ahimsa) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీతో దగ్గుబాటి రానా (Rana Daggubati) తమ్ముడు అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయం అవుతున్నాడు. జూన్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే రెండు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న తేజ.. రెండిటిలో రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Mahesh Babu : నా హీరోల్లో మహేష్ బాబు బెస్ట్.. నేను అనుకున్న రియాక్షన్ కరెక్ట్‌గా ఇచ్చేవాడు.. తేజ!
రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటన చూసి తేజ అభిమాని అయ్యిపోయాడట. ఇప్పటి జనరేషన్ లో చరణ్ అంటే తనకి ఇష్టమని, తన సినిమా చూడడానికే థియేటర్ కి వెళ్తానని చెప్పుకొచ్చాడు. అలాగే తన ఫేవరెట్ మూవీ కూడా రంగస్థలం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాని పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
Naatu Naatu : ‘నాటు నాటు’తో యుక్రెయిన్ నిరసన.. సైనికుల రీ క్రియేట్ వీడియో వైరల్!
కియారా అద్వానీ (Kiara Advani) చరణ్ కి జోడిగా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసిన శంకర్.. జూన్ ఫస్ట్ వీక్ లో కొన్ని కీలక సన్నివేశాల కోసం మైసూర్ వెళ్తున్నట్లు తెలుస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరో రెండు నెలలో పూర్తి కానుందని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.