Trivikram Srinivas : పుస్తకాలు ఎందుకు చదవాలో అద్భుతంగా చెప్పిన దర్శకుడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సందర్భాల్లో పుస్తక పఠనం గురించి మాట్లాడుతుంటారు. తాజాగా పుస్తకాలు ఎందుకు చదవాలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Trivikram Srinivas : పుస్తకాలు ఎందుకు చదవాలో అద్భుతంగా చెప్పిన దర్శకుడు

Trivikram Srinivas

Trivikram Srinivas : రచయితగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన సినిమాలతో జనాలను థియేటర్లకు ఎలా రప్పించగలరో అలాగే తన మాటలతో అందరి మనసుల్ని కట్టిపడేస్తారాయన. మాటల మాంత్రికుడిగా ముద్ర పడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుస్తక పఠనం గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పుస్తకాలు ఎందుకు చదవాలో ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.

Animal Collections : బాలీవుడ్‌ని షేక్ ఆడించిన సందీప్ వంగా.. ఖాన్‌లని దాటిన కపూర్.. యానిమల్ మొదటి రోజు కలెక్షన్స్..

త్రివిక్రమ్ 1999 లో ‘స్వయంవరం’ సినిమాకి మాటల రచయితగా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. దర్శకుడిగా మారకముందు చాలా సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. చాలా సినిమాల్లో సందర్భాన్ని బట్టి ఆయన రాసిన  డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. పలు వేదికలపై ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో షేర్ అవుతుంటాయి. తాజాగా త్రివిక్రమ్ ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అసలు పుస్తకాలు ఎందుకు చదవాలో చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి.

‘ఇప్పుడంతా చూసే జనరేషన్.. చదివే జనరేషన్’ కాదన్నారు త్రివిక్రమ్. ఏదైనా వినేటపుడు, చూసేటపుడు పక్కవారితో మాట్లాడతారు.. చదివేటపుడు మీతో మీరే మాట్లాడుకుంటారు.. మనతో మాట్లాడుకోవడం అనేది ఇప్పటి జనరేషన్ కి చాలా అవసరం అన్నారాయన. మనలో మనం మాట్లాడుకోకపోవడం అనే ప్రక్రియ లేకపోవడం వల్లే సోషల్ మీడియాలో ఎదుటివారిని బాధపెట్టేలా మాట్లాడగలుగుతున్నారని, ఏదైనా మాట్లాడే ముందు ఆగి, ఆలోచించే లక్షణం మనుష్యుల్లో తగ్గిపోయిందని త్రివిక్రమ్ అన్నారు. చందమామ, బొమ్మరిల్లు దగ్గర్నుంచి ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఫిలాసఫీ ఇలా చదువుతూ వెళ్తే ఖచ్చితంగా బెటర్ పర్సన్ అవుతారని ఆయన చెప్పారు. పుస్తకాన్ని మించిన ఉలి ఇంకోటి ఉండదని.. తనను చాలా పుస్తకాలు చెక్కాయని అన్నారు. చదవడం అనే లక్షణం నెక్ట్స్ జనరేషన్స్‌లో పెరగాలని కోరుకుందాం అంటూ త్రివిక్రమ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nani : నాని సినిమాకి కూడా సెన్సార్.. ‘హాయ్ నాన్న’ సినిమా నుండి ఆ సీన్స్ కట్ చేసిన సెన్సార్ బోర్డు

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో దూసుకుపోయింది. 2024 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.