Sai Kiran – P. Susheela : ఈ నటుడు గానకోకిల సుశీలమ్మకు బంధువని తెలుసా? అప్పుడు సినిమాల్లో.. ఇప్పుడు సీరియల్స్ లో..
సాయి కిరణ్ కి సీనియర్ స్టార్ సింగర్ సుశీల బంధువని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Do You Know Actor Sai Kiran is Relative to Star Singer P Susheela
Sai Kiran – P. Susheela : సినీ పరిశ్రమలో ఒకరికి ఒకరు బంధువులుగా చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం చెప్పుకోరు. గతంలో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సాయి కిరణ్ కి సీనియర్ స్టార్ సింగర్ సుశీల బంధువని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సంగతి ఇండస్ట్రీలో కొంతమందికి తెలిసినా ఆడియన్స్ కి ఎక్కువగా తెలీదు.
నువ్వే కావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉంది.. సాంగ్ తో ఫేమస్ అయిన సాయి కిరణ్ ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరమే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు.
Also Read : Odela 2 : తమన్నా అఘోరిగా నటించిన ‘ఓదెల 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎందులో?
సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ కూడా సింగర్ గా సినీ పరిశ్రమలో అనేక పాటలు పాడారు. సాయి కిరణ్ కి పి.సుశీల నాయనమ్మ అవుతుందట. సాయి కిరణ్ తండ్రి రామకృష్ణకు సుశీల స్వయానా పిన్ని అవుతుందట. అలా సాయి కిరణ్ కి నానమ్మ అవుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు సాయి కిరణ్.
అయితే తాను సుశీల మనవడిని అని చెప్పుకోవడం ఇష్టం ఉండదని, మా ఇద్దరి మధ్య మంచి బంధమే ఉందని తెలిపాడు. కొంతమంది తన అభిమానులు సుశీల దగ్గర మీ మనవడు సీరియల్స్ లో బాగా నటిస్తున్నాడు అని చెప్పడంతో ఆవిడ నా దగ్గరికి వచ్చి అభినందించింది అని తెలిపాడు. దీంతో నటుడు సాయి కిరణ్ సుశీలకు మనవడు అవుతాడా అని అతని సీరియల్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read : NTR – Komalee Prasad : నేను ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ ని.. మా నాన్న చనిపోయాక ఎన్టీఆర్ స్పీచ్ ఒకటి..