Shobha Raju : శోభా రాజుకి సమంత భర్తకు రిలేషన్ ఏంటి..? సంగీత కుటుంబంలోకి సామ్.. పాత వీడియో వైరల్..

సమంత సంగీత కుటుంబంలోకి అడుగుపెట్టింది అంటున్నారు. (Shobha Raju)

Shobha Raju : శోభా రాజుకి సమంత భర్తకు రిలేషన్ ఏంటి..? సంగీత కుటుంబంలోకి సామ్.. పాత వీడియో వైరల్..

Shobha Raju

Updated On : December 3, 2025 / 2:35 PM IST

Shobha Raju : నటి సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండో వివాహమే. గత రెండు రోజులుగా వీరి పెళ్లి ఫొటోలు, వీళ్ళ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ తమ ఫ్యామిలీ ఫోటోని షేర్ చేయడంతో భర్త ఫ్యామిలీతో సమంత దిగిన ఫోటో మరింత వైరల్ గా మారింది.(Shobha Raju)

ఈ క్రమంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సమంత సంగీత కుటుంబంలోకి అడుగుపెట్టింది అంటున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు ప్రముఖ సంగీత విద్వాంసురాలు శోభారాజుకు బంధువులు అవుతారు. దైవ సంకీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలతో పాటు రచయితగా, సంగీత దర్శకురాలిగా ఎంతో పేరు సంపాదించారు డాక్టర్ శోభారాజు. ఈమెకు 2010 లోనే పద్మశ్రీ కూడా వరించింది.

Also Read : Prabhas : కృష్ణం రాజు అలా అనేసరికి.. ప్రభాస్ ఏకంగా స్పెషల్ ఫ్లైట్ తెప్పించి ఏం చేసాడంటే..

శోభారాజు సోదరి రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. రాజ్ చిన్నప్పుడు శోభారాజు దగ్గర క్లోజ్ గా ఉండేవాడట. తాజాగా శోభారాజు రాజా నిడిమోరు, శీతల్ నిడిమోరులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శోభారాజు ముందు రాజ్, శీతల్ యాక్టింగ్ చేసి చూపిస్తున్నారు. 2023 కి చెందిన ఈ వీడియో సమంత పెళ్లితో ఆమె భర్త ఎవరు అంటూ బయటకు వచ్చింది. అలా సమంత కూడా సంగీత కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చింది అంటున్నారు. ఇక రాజా నిడిమోరు దర్శకుడు, నిర్మాత అని తెలిసిందే.

సమంత భర్త రాజ్ నిడిమోరు, తన సోదరి శీతల్ శోభారాజుతో మాట్లడుతున్న పాత వీడియో మీరు కూడా చూసేయండి..

 

Also See : Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి.. పెళ్లి చీరలో సమంత సోలో ఫొటోలు చూశారా?