Nara Lokesh : రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది చేస్తారు.. జగన్, సజ్జలపై లోకేశ్ ఫైర్
Nara Lokesh : జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది. రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది మాట్లాడతాడు. బహుశా జూమ్‌లో వస్తాడేమో.. అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.
Nara Lokesh
- జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది
- రాత్రి ఆత్మ ఏంచెప్తే ఉదయాన్నే అది మాట్లాడుతారు
- అసెంబ్లీ గురించి మాట్లాడడానికి సజ్జలకు ఏ అర్హత ఉంది
- మీడియా చిట్‌చాట్‌లో మంత్రి నారా లోకేశ్
Nara Lokesh : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో లోకేశ్ మాట్లాడారు. శాసనమండలిలో అమరావతి చట్టబద్దత తీర్మానం పెట్టాలంటున్న వైసీపీ.. ముందు శాసనసభకు రావాలని సూచించారు. ఇంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంటే జగన్ బెంగళూరు వెళ్లిపోవటం ఏమిటని లోకేశ్ ప్రశ్నించారు.
జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది. రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది మాట్లాడతాడు. బహుశా జూమ్‌లో వస్తాడేమో.. అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ పరామర్శలు పేరుతో వివాదాలు సృష్టిస్తున్నాడని అన్నారు. 11గంటలకు సమావేశాలు పెట్టాం.. ఆ 11 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి వస్తే బాగుండేది. జగన్ పదేపదే సినిమా చూపిస్తా అంటున్నాడు. .ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో జగన్ కు సినిమా చూపిస్తేనే 11 సీట్లకు పడిపోయారు, తుగ్లక్ పాలనకు చరమగీతం పాడారు. మళ్లీ అదే పాలన ప్రజలు వద్దనుకుంటున్నారని లోకేశ్ అన్నారు.
అసెంబ్లీ గురించి మాట్లాడడానికి సజ్జలకు ఏం అర్హత ఉంది. ఆయనేమన్నా ఎమ్మెల్యేగా గెలిచాడా? మాట్లాడితే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి. రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. పార్లమెంటులో అన్ని పార్టీలు అమరావతికి మద్దతిస్తాయి. ఇక్కడ వ్యతిరేకించేవాళ్లు అక్కడ మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.
గతంలో ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్తే.. పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం చేశారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. సీఎం ప్రోటోకాల్ మినహా అదనపు సిబ్బందిని వినియోగించడం లేదు. గతంలో సీఎంకి బయటకు వెళ్తే వందల మందిని పోలీసులను పహారా పెట్టుకునే వాడు. గతంలో విజయ్ సాయిరెడ్డి వైజాగ్ వెళ్తే జామర్లు పెట్టుకుని గ్రీన్ చానల్ ఇచ్చారని లోకేశ్ విమర్శించారు. అమరావతికి చట్టబద్దత ఒక్క రాజధాని రైతులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ న్యూస్ అని లోకేశ్ చెప్పారు.
