Mahesh Babu : రాజమౌళి సినిమా షూటింగ్ బ్రేక్.. మహేష్ వెకేషన్ కి ఏ దేశానికి వెళ్ళాడో తెలుసా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్..

ఇటీవల రాజమౌళి సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడంతో మహేష్ వెకేషన్ కి వెళ్ళాడు.

Mahesh Babu : రాజమౌళి సినిమా షూటింగ్ బ్రేక్.. మహేష్ వెకేషన్ కి ఏ దేశానికి వెళ్ళాడో తెలుసా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్..

Do you know where Mahesh Babu went on vacation with his family during the shooting gap of Rajamouli film

Updated On : April 7, 2025 / 4:40 PM IST

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. మహేష్ బాబు కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు. కానీ రాజమౌళి సినిమా షూటింగ్ ముందు మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసేసుకున్నాను అని పోస్ట్ పెట్టడంతో మహేష్ ఈ సినిమా అయ్యేదాకా విదేశాలకు వెళ్లలేదు అనుకున్నారు.

Also Read : Mitraaw Sharma : హర్ష సాయి ఇష్యూ తర్వాత.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ మిత్రా శర్మ.. పోస్టర్ వైరల్..

అయితే ఇటీవల రాజమౌళి సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడంతో మహేష్ వెకేషన్ కి వెళ్ళాడు. ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు పాస్ పోర్ట్ చూపించి మరీ వెళ్లడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరప్ లోని ఇటలీ దేశానికి వెళ్లారు. ఇటలీలో పురాతనమైన నగరం రోమ్ కి వెళ్లారు. మహేష్ భార్య నమ్రత, కూతురు సితార రోమ్ లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

అయితే ఈ వెకేషన్ నుంచి మహేష్ బాబు ఫొటోస్ ఏమైనా షేర్ చేస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మహేష్ ఎక్కువగా యూరప్ దేశాలకే వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా యూరప్ దేశమైన ఇటలీకి వెకేషన్ కి వెళ్లారు. ఇటలీలో మహేష్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రాజమౌళి నెక్స్ట్ సినిమా షూటింగ్ షెడ్యుల్ ఏప్రిల్ 15 తర్వాత ఉంటుందని సమాచారం.