Keneeshaa Francis : అసలు ఎవరీ కెనీషా..? 18 ఏళ్లకే పెళ్లి, 19 ఏళ్లకు గర్భస్రావం.. జయంరవి లైఫ్ లోకి వచ్చి.. ఇప్పుడు అన్ని వదిలేసి..
తమిళనటుడు జయం రవి - సింగర్ కెనిషా గత కొన్నాళ్లుగా వార్తలో నిలుస్తున్నారు. (Keneeshaa Francis)

అసలు ఎవరీ కెనీషా..? 18 ఏళ్లకే పెళ్లి, 19 ఏళ్లకు గర్భస్రావం.. జయంరవి లైఫ్ లోకి వచ్చి.. ఇప్పుడు అన్ని వదిలేసి..

తమిళనటుడు జయం రవి - సింగర్ కెనిషా గత కొన్నాళ్లుగా వార్తలో నిలుస్తున్నారు. జయం రవి తన భార్య ఆర్తి డబ్బుకోసమే తనని పెళ్లి చేసుకుందంటూ సంచలన ఆరోపణలు చేసి ఆమెతో విడిపోతున్నట్టు ప్రకటించాడు. అనంతరం సింగర్ కెనీషాతో ఎక్కువ కనపడటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

అయితే జయం రవి, కెనీషాపై ట్రోల్స్ రాగా కెనీషా జయం రవిని, నా సంగీతం, చెన్నై ప్రపంచాన్ని, అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో జయం రవి కూడా ప్రెస్ మీట్ పెట్టి కెనీషా వెళ్లిపోయేలా చేసారంటూ బాధపడి, తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేసాడు.

ఈ నేపథ్యంలో అసలు కెనీషా ఎవరు, ఆమె జయం రవికి ఎలా దగ్గరయింది అంటూ వైరల్ అవుతుంది.

కెనీషా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన గురించి తెలిపింది. అలాగే ఇటీవల తన చుట్టూ వస్తున్న ట్రోల్స్ గురించి కూడా స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి అనంతరం డిలీట్ చేసింది.

కెనీషా తల్లి 2013 లోనే చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు తండ్రి కూడా చనిపోయాడు. తన ఫ్యామిలీలోనే చాలా మంది మగవాళ్ళు ఆమెని ఇబ్బంది పెట్టారట. తండ్రి చివరి రోజుల్లో తనే దగ్గరుండి చూసుకుంది.

చిన్నప్పుడు చర్చిలో పాటలు పాడటం మొదలుపెట్టింది. అలా కాఫీ షాప్ లో రోజుకు 500 తీసుకొని పాటలు పాడేది. చిన్నప్పుడే పాటలు పాడి ది స్టేజ్ అనే షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఇవాళ ఒక సింగర్ గా, థెరపిస్ట్ గా, కౌన్సిలర్ గా ఎదిగింది.

18 ఏళ్లకే తనకు పెళ్లి చేసేసారు. 19 ఏళ్లకు తనకు గర్భస్రావం అయింది. తన భర్త టాక్సిక్ కావడం, వేరే మహిళలతో సంబంధం పెట్టుకోవడం, కెనీషాని కొట్టడం, తిట్టడం చేయడంతో చాలా కష్టాల తర్వాత ఆ బంధం లోంచి బయటకు వచ్చేసింది.

తన పెళ్లి బంధం నుంచి బయటకి వచ్చిన దగ్గర్నుంచి ఒంటరిగానే బతుకుతుంది.

జయం రవి లైఫ్ లోకి వచ్చాక కొంతమంది తనకి పెళ్లయిందని, నలుగురు పిల్లలు ఉన్నారని, తండ్రిని వృద్ధాశ్రమంలో వేశారని తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసారు.

తన గురించి తెలుసుకోవడానికి బెంగుళూరుకు డిటెక్టివ్స్ ని పంపించారని, తన సోషల్ మీడియా ఖాతాలని హ్యాక్ చేసారని ఆరోపణలు చేసింది.

కడుపులోనే బిడ్డను పోగొట్టుకున్న నేను ఓ వ్యక్తిని తన పిల్లలకు దూరం చేస్తానా అని తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించింది.

జయం రవి గురించి చెప్తూ.. ఓ ఆడియో లాంచ్ లో కలిసాము. ఆ తర్వాత తాను థెరపీ కోసం నా దగ్గరకు పేషేంట్ లా వచ్చాడు. అతనికి ట్రీట్మెంట్ చేశాను. అలా ఫ్రెండ్స్ అయ్యాము. మేము మంచి ఫ్రెండ్స్. అతను కష్టాల్లో ఉన్నప్పుడు నేను నిలబడ్డాను అని తెలిపింది.

గత సంవత్సరం నుంచి నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాను నా 34 ఏళ్ళ లైఫ్ లో. ఇప్పుడు అన్ని ఆపేస్తున్నాను. జయం రవితో సహా అందర్నీ, అన్ని వదిలేసి వెళ్తున్నాను, సోషల్ మీడియా కూడా క్లోజ్ చేస్తున్నాను అని కెనిషా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కెనీషా సింగర్ గా అనేక లోకల్ బ్యాండ్స్ తో పెర్ఫార్మ్ చేసింది. అనేక పబ్లస్, ఈవెంట్స్ లో, సినిమా ఫంక్షన్స్ లో పెర్ఫార్మ్ చేసింది. సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పలు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసి ఫేమ్ తెచ్చుకుంది.



Keneeshaa Francis
