Lucky Baskhar : ఆరు రోజుల్లో దుల్క‌ర్ స‌ల్మాన్ ‘ల‌క్కీ భాస్క‌ర్’ ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా?

మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేశాడు దుల్కర్ సల్మాన్.

Lucky Baskhar : ఆరు రోజుల్లో దుల్క‌ర్ స‌ల్మాన్ ‘ల‌క్కీ భాస్క‌ర్’ ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా?

Dulquer Salmaan Lucky Baskhar Movie Six Days Collections

Updated On : November 6, 2024 / 2:09 PM IST

Lucky Baskhar : మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేశాడు దుల్కర్ సల్మాన్. ఆయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ ల‌క్కీ భాస్క‌ర్. మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌గా న‌టించ‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది.

విడుద‌లైన ఆరు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా 67.6 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. దీవాళి మెగా బ్లాక్‌బాస్ట‌ర్ అంటూ రాసుకొచ్చింది.

Alia Bhatt : నా కూతురు పబ్లిక్ ఫిగర్ అవ్వడం నాకు ఇష్టం లేదు.. ఆలియా షాకింగ్ కామెంట్స్..

సాయికుమార్, స‌చిన్ ఖేడేక‌ర్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు.

బ్యాంకింగ్‌ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

Allu Sneha Reddy : తిరుమలలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి.. ఫోటోల కోసం ఎగబడ్డ జనాలు.. వీడియో వైరల్..