Dulquer Salman : సొంత రాష్ట్రంలో దుల్కర్ సినిమాలపై నిషేదం

దుల్కర్ 'సెల్యూట్' సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో కేరళ థియేటర్ ఓనర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేరళ థియేటర్ ఓనర్స్ దుల్కర్ సినిమాలపై నిషేధం విధించారు.....

Dulquer Salman : సొంత రాష్ట్రంలో దుల్కర్ సినిమాలపై నిషేదం

Dulqer

Updated On : March 17, 2022 / 4:24 PM IST

Dulquer Salman :  మమ్ముట్టి తనయుడు, మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కు సొంత రాష్ట్రంలోనే తన సినిమాలపై నిషేదం పడింది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘సెల్యూట్‌’ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ‘సెల్యూట్’ సినిమాను ఈనెల 18న సోనీ లివ్‌లో డైరెక్ట్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో దుల్కర్‌ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

అయితే దుల్కర్ ‘సెల్యూట్’ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో కేరళ థియేటర్ ఓనర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేరళ థియేటర్ ఓనర్స్ దుల్కర్ సినిమాలపై నిషేధం విధించారు.

దుల్కర్ తదుపరి చిత్రాలని కూడా బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారు. దుల్కర్ ‘సెల్యూట్‌’ సినిమా మొదట థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో కేరళ థియేటర్ ఓనర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

దుల్కర్ లాంటి స్టార్ హీరో సినిమాలని బాయ్‌కాట్ చేస్తున్నారని తెలిసి కేరళ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ షాక్‌లో ఉన్నారు. మరి దుల్కర్ సినిమా థియేటర్ ఓనర్స్‌తో మాట్లాడతారా, ఈ సమస్యని పరిష్కరించుకుంటారా చూడాలి.