Ravi Teja : రవితేజను విచారిస్తున్న ఈడీ.. కెల్విన్‌తో సంబంధాలపై ఆరా

టాలీవుడ్ డ్రగ్‌ కేసులో హీరో రవితేజను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి విచారణకు హాజరైన రవితేజను.. కెల్విన్‌తో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Ravi Teja : రవితేజను విచారిస్తున్న ఈడీ.. కెల్విన్‌తో సంబంధాలపై ఆరా

Drugs Case

Tollywood drug case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్‌ కేసులో ఈడీ అధికారులు రవితేజను ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి విచారణకు హాజరైన రవితేజను.. కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్‌కు సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఎక్సైజ్ అధికారులు రవితేజను, ఆయన డ్రైవర్‌ను విచారించారు. అయితే.. ఎక్సైజ్ విచారణతో పాటు కెల్విన్ ఇచ్చిన సమాచారంపైనా ఈడీ రవితేజను ప్రశ్నిస్తోంది.

డ్రగ్స్ కొనుగోలు కోసం రవితేజ ఎవరికైనా డబ్బులు పంపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ కొనుగోలుకు లావాదేవీలు జరిపారా? కెల్విన్‌కు ఎప్పుడైనా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశారా? ఎఫ్‌ క్లబ్‌తో ఏమైనా సంబంధం ఉందా? మీ డ్రైవర్‌ ఎప్పుడైనా డ్రగ్స్‌ కోనుగోలు డీల్ చేశారా?… అనే వాటిపై ఆరా తీస్తోంది. ఇందుకోసం రవితేజ బ్యాంకు అకౌంట్లను పరిశీలించనుంది.

ఇక నిన్న హీరో రానాను 7 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. రానాతో పాటు డ్రగ్ పెడలర్ కెల్విన్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా రానా-కెల్విన్ మధ్య సంబంధాలపై అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలు కోసం వీళ్లిద్దరి మధ్య ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయా? అన్న విషయంపై ఆరా తీశారు.

ఇందుకు రానా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2015 నుంచి 2017 వరకు బ్యాంకు స్టేట్‌మెంట్స్‌ను అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించారు.. ఇందులో రానా, నందులను కెల్విన్‌ సమక్షంలో విచారించారు..

దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌పైన ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపైనా ఆరా తీసింది. డ్రగ్స్ కొనుగోలు కోసం రానా ఎవరికైనా డబ్బు పంపించారా? అన్న కోణంలో ఈడీ విచారణ జరిపింది.