Ester Noronha : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఎస్తర్ నోరాన్హా.. ‘లేతాకులు’ మూవీ ప్రారంభం..
ఎస్తర్ నోరాన్హా కీలకపాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీ "లేతాకులు" హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.

Ester Noronha Lady Oriented Film Lethakulu Movie Opening
Ester Noronha New Movie : M R చౌదరి వడ్లబట్ల సమర్పణలో ఫ్రెష్ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకటేష్ చిక్కాల నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ “లేతాకులు” హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఎస్తర్ నోరాన్హా కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని చంటి జ్ఞానమణి తెరకెక్కిస్తున్నారు. ఎస్తర్ ,శృతి శరణ్, అవయుక్త, వంశీ పాండ్యలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభానికి బీసీ కమిషన్ చైర్మన్ వకలబరణం కృష్ణ మోహన్ రావ్ క్లాప్ కొట్టగా మోహన వడ్లపట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. తమ్ముడు సత్యం స్క్రిప్ట్ అందివ్వగా ప్రముఖ దర్శకులు V సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా ఓపెనింగ్ అనంతరం చిత్ర సమర్పకులు MR చౌదరి వడ్లపట్ల మీడియాతో మాట్లాడుతూ… మా లేతాకులు సినిమా ఓ కొత్త కాన్పెస్ట్ లో వస్తుంది. నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం నాకు ఉంది. కానీ దర్శకులు చంటి జ్ఞానమణి చెప్పిన కథ, కథనం బాగా నచ్చాయి. క్లైమాక్స్ మాత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటివరకు ఇటువంటి కాన్సెప్ట్ రాలేదు. ఇది ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుంది. ఈ సినిమాను అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా నిర్మిస్తున్నామని అన్నారు.
నిర్మాత వెంకటేష్ చిక్కాల మాట్లాడుతూ.. దర్శకత్వ శాఖలో చాలా యేళ్లుగా పనిచేస్తున్నాను. కానీ చంటి జ్ఞానమణి గారు చెప్పిన కథ బాగా నచ్చి సినిమాను నిర్మించడానికి ముందకు వచ్చాను. ఇటువంటి కథ నమ్మి MR చౌదరి వడ్లపట్ల గారు కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు. ఎస్తర్ మా సినిమాలో కీ రోల్ చేస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని, దసరా తర్వాత షూటింగ్ జరుగుతుందని, ముఖ్కమైన సన్నివేశాలను ఉత్తరప్రదేశ్ లో షూట్ చేయనున్నట్టు తెలిపారు.
దర్శకులు చంటి జ్ఞానమణి మాట్లాడుతూ.. నూతిలోకప్పలు సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా లేతాకులు. ఒకరిని బాధ పెట్టిన వారికి ఏదో శిక్ష విధించడం శిక్ష కాదు అదే బాధ వాళ్ళకి కలిగాలా చేయడమే అసలైన శిక్ష అని అండర్ కరెంట్ గా చెప్పే కథ ఇది. ఈ సినిమా కథ అందరికి నచ్చింది. మా సినిమాలో క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుందని అన్నారు.
హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా మాట్లాడుతూ.. దర్శకులు చంటి జ్ఞానమణి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నేను చేసిన సినిమాలతో పోల్చితే ఈ కథ డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా . నా కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలుస్తుందని తెలిపింది.