అప్పుడే అమెజాన్‌లో? అంతేగా..అంతేగా!
ఫిబ్రవరి 11 నుండి అమెజాన్‌లో ఎఫ్2.

ఫిబ్రవరి 11 నుండి అమెజాన్‌లో ఎఫ్2.
విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, నాలుగవ వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్‌మోస్ట్ చూసేసారు. రీపిటెడ్ ఆడియన్స్ కూడా పెరిగారు. ఇంకా వీకెండ్స్‌లో చాలా చోట్ల ఫుల్స్ పడుతుండగా, వీక్‌డేస్‌లోనూ మంచి వసూళ్ళు రాబడుతుంది. ఇప్పటికే దాదాపు రూ.75 కోట్లు రాబట్టిన ఎఫ్2, త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఫిబ్రవరి 11 నుండి అమెజాన్‌లో ఎఫ్2 అంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. జనవరి 12న ఎఫ్2 రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 11 నాటికి కరెక్ట్‌గా 30 రోజులు పూర్తి చేసుకుంటుంది. కె.జి.ఎఫ్. 40 రోజులు దాటాక స్ట్రీమింగ్ అవ్వగా, ఎన్టీఆర్ కథానాయకుడు కూడా రిలీజ్ అయిన 30 రోజులకే అమెజాన్‌లోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 8న కథానాయకుడు స్ట్రీమింగ్ అవుతుంది. థియేట్రికల్ రన్ బాగా ఉండగానే ఎఫ్2, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషమే.
వాచ్ హనీ ఈజ్ ది బెస్ట్ మేకింగ్ వీడియో…