లేడీస్ చాలా ఈజీగా నమ్మేది చాడీస్ – ఎఫ్2 ట్రైలర్

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎఫ్2, జనవరి 12న రిలీజ్ కానుంది.

  • Published By: sekhar ,Published On : January 8, 2019 / 05:33 AM IST
లేడీస్ చాలా ఈజీగా నమ్మేది చాడీస్ – ఎఫ్2 ట్రైలర్

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎఫ్2, జనవరి 12న రిలీజ్ కానుంది.

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్.. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కి ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. రీసెంట్‌గా ఎఫ్2 ట్రైలర్ లాంచ్ చేసింది మూవీ యూనిట్. ట్రైలర్ స్టార్టింగ్‌లోనే లుంగీ కట్టుకుని, చేతిలో బుట్టతో, ఆడ లేడీస్‌తో కబుర్లు చెబుతూ, మార్కెట్‌లో నడుచుకుంటూ రావడంతోనే నవ్వులు స్టార్ట్ అవుతాయి.

చివరిగా నవ్వుకుని తాళి కట్టు నాయానా అంటూ పంతులు గారు పంచ్ పేలిస్తే, సర్ఫెక్సెల్ మర్చిపోయి, గుర్తు పెట్టుకుని మరీ మల్లెపూలు తీసుకొచ్చినందుకు గానూ, వెంకీ వైఫ్ ఫస్ట్రేషన్‌కి గురవడం, అన్నపూర్ణమ్మ, అట్టా ఏడిపించకపోతే, దాని కడుపున ఒక కాయ కాయించొచ్చుగా అంటే, వెంకీ, 24 గంటలూ మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే, కాయలెక్కడ కాస్తాయ్, నీ తలకాయ్ అనడం మామూలుగా లేదసలు. లేడీస్ చాలా ఈజీగా నమ్మేది చాడీస్, వెంకీ ఆసన్ వంటివి చూస్తుంటే, పండక్కి బాగా గట్టిగానే నవ్వించేలా ఉన్నారు. ట్రైలర్ ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దాటేసింది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎఫ్2, జనవరి 12న రిలీజ్ కానుంది.

వాచ్ ఎఫ్2 ట్రైలర్…