Vijay Deverakonda : ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ డైలాగ్.. ఐరనే వంఛాలా ఏంటి..?

తాజాగా నెట్టింట 'ఐరనే వంచాలా ఏంటి..?' అనే డైలాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది..? అసలు ఆ డైలాగ్ ఏ మూవీలోనిది..? ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది..?

Vijay Deverakonda : ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ డైలాగ్.. ఐరనే వంఛాలా ఏంటి..?

Family Star Vijay Deverakonda Airanevonchalaenti dialogue viral in social media

Updated On : October 26, 2023 / 5:20 PM IST

Family Star Movie Dialogue : సోషల్ మీడియాలో టాలీవుడ్ సినిమాల గురించి ఏదొక విషయం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా నెట్టింట ‘ఐరనే వంఛాలా ఏంటి..?’ అనే డైలాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. నిర్మాత, హీరో కూడా ఈ ట్రెండ్ గురించిన పోస్టులు వేస్తూ మరింత ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది..? అసలు ఆ డైలాగ్ ఏ మూవీలోనిది..? ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది..?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీతగోవిందం సినిమాతో విజయ్ కి సూపర్ హిట్టుని అందించిన పరుశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో విజయ్ ఒక పక్క ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తూనే యాక్షన్ కూడా చేసి చూపించాడు. ఆ యాక్షన్ సీన్ లో విజయ్ చెప్పిన డైలాగ్ ‘ఐరనే వంఛాలా ఏంటి..?’.

Also read : Suriya : దుల్కర్ సల్మాన్‌తో మూవీ అనౌన్స్ చేసిన సూర్య.. మల్టీస్టారర్ చిత్రమా..?

ఇక ఈ డైలాగ్ ని ఒక అభిమాని మిర్చి సినిమా సీన్ తో ఎడిట్ చేసి.. డైలాగ్ మైండ్ లో నుంచి పోవడం లేదురా అని పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్టుకి నీరంతా దిల్ రాజు అకౌంట్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. మాకు కూడా మైండ్ లో నుంచి పోవడం లేదు అని ట్వీట్ చేశారు. అలాగే విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఇంటర్నెట్ లో అసలు ఏం నడుస్తుంది అంటూ పోస్టు చేస్తాడు.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా #Airanevonchalaenti హాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. ఇక కొంతమంది అభిమానులు రియాక్ట్ అవుతూ.. ఈమధ్య కాలంలో పుష్ప నుంచి ‘తగ్గేదేలే’, ఆర్ఆర్ఆర్ నుంచి ‘తొక్కుకుంటూపోవాలే’ ఫేమస్ అయ్యినట్లు ఫ్యామిలీ స్టార్ ‘ఐరనే వంచాలా ఏంటి..?’ డైలాగ్ కూడా అంతే ఫేమస్ అవుతుంది అంటూ పోస్టులు వేస్తున్నారు.