Shah Rukh Khan : ‘డంకీ’ మూవీకి పోటెత్తిన అభిమానులు .. షారూఖ్ హార్డీ పాత్రలో సందడి చేసిన అభిమాని

షారుఖ్ ఖాన్ 'డంకీ' రిలీజ్ కావడంతో థియేటర్లన్నీఅభిమానులతో కోలాహలంగా మారాయి. సినిమాలో షారుఖ్ గెటప్ వేసుకుని ఓ అభిమాని థియేటర్ వద్ద సందడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Shah Rukh Khan : ‘డంకీ’ మూవీకి పోటెత్తిన అభిమానులు .. షారూఖ్ హార్డీ పాత్రలో సందడి చేసిన అభిమాని

Shah Rukh Khan

Updated On : December 21, 2023 / 2:01 PM IST

Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ ‘డంకీ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. షారుఖ్ అభిమానులతో థియేటర్లు కిటకిటలాడాయి. ఓ థియేటర్ వద్ద షారుఖ్ అభిమాని ఒకరు సినిమాలో SRK పాత్ర హార్డీలా తయారై వచ్చి సందడి చేశాడు.

Keerthy Suresh : ‘సలార్’ నిర్మాతలతో కీర్తి సురేష్ కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ చూశారా?.. రిక్షా మీద ‘రఘుతాత’..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాతో భారీ హిట్స్ అందుకున్నారు. డిసెంబర్ 21 న విడుదలైన ‘డంకీ’ సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ఇక షారుఖ్ అభిమానుల సందడి మామూలుగా లేదు. ఓ అభిమాని సినిమాలో షారుఖ్ పాత్ర హార్డీలాగ గెటప్ వేసుకుని థియేటర్ వద్ద సందడి చేసారు. నీలంరంగు కుర్తా, పైజామా దానిపై మ్యాచింగ్ స్వెట్టర్ వేసుకుని కనిపించారు. సినిమాలో కనిపించే ఓ సన్నివేశాన్ని థియేటర్ బయట ప్రదర్శించి అందరినీ ఉత్సాహ పరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే దీనిపై షారుఖ్ ఖాన్ స్పందించారు.

షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’ గురించి ప్రేక్షకులు ఏమన్నారంటే?

Shah Rukh Khan Universe Fan Club అనే ట్విట్టర్ యూజర్ నుండి షేర్ అయిన ఈ వీడియోపై షారుఖ్ ఖాన్ స్పందించారు. ‘సినిమా చూడటానికి వెళ్తారా? బయట కుస్తీ చేస్తూ ఉండిపోతారా? సినిమా చూసి మీరందరూ ఎంజాయ్ చేశారో? లేదో? చెప్పండి’ అనే శీర్షికతో రిప్లై ఇచ్చారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో వచ్చిన డంకీ సినిమాని రాజ్ కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ నిర్మించారు. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, తాప్సీతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు.