షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’ గురించి ప్రేక్షకులు ఏమన్నారంటే?

షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది, నిరాశపరిచిందని కొంతమంది చెబుతున్నారు.

షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’ గురించి ప్రేక్షకులు ఏమన్నారంటే?

Shah Rukh Khan starrer Dunki movie

Updated On : December 21, 2023 / 6:11 PM IST

Dunki movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈసారి ‘డంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజయింది. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో హిట్ కొట్టిన షారూఖ్.. ‘డంకీ’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ‘డంకీ’ సినిమా చూసిన ప్రేక్షకులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. విలక్షణ కాథాంశాలతో సినిమాలు తీసే రాజ్‌కుమార్ హిరానీ ఈసారి నిరాశపరిచాడని చాలా మంది అంటున్నారు. కొంతమంది మాత్రం సినిమా బాగుందని చెబుతున్నారు.

ఓవరాల్‌గా సినిమా బాగుంది
ముంబై గైటీ గెలాక్సీ మూవీ థియేటర్ లో ‘డంకీ’ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ​‘డంకీ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అంతా కొద్దిగానే ఉన్నా ఓవరాల్‌గా సినిమా బాగుంది. కథ చాలా బాగుంది. విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు. సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా చేశారు. నేనయితే 3.5 పాయింట్ రేటింగ్ ఇస్తాన’ని సినీ ప్రేక్షకుడు ఒకరు అన్నారు.

Dunki Teaser

Dunki 

డిజ్‌పాయింట్‌ చేశాడు..
​‘డంకీ’ సినిమా తనను నిరుత్సాహానికి గురిచేసిందని మరొకరు వ్యాఖ్యానించారు. రాజ్‌కుమార్ హిరానీపై భారీ అంచనాలతో సినిమాకు వచ్చానని, కానీ తమను డిజ్‌పాయింట్‌ చేశాడని అన్నారు. హిరానీ అప్‌డేట్ కాలేదనిపిస్తోంది.. తమ అభిమాన నటుడి సినిమా అయినప్పటికీ కథ, జోకులు పాతగా ఉన్నాయని చెప్పారు. ఈ సినిమా తమను మెప్పించలేకపోచయిందన్నారు.

2 స్టార్స్ రేటింగ్ ఇస్తా
“నేను షారూఖ్‌కి పెద్ద ఫ్యాన్‌ని, డంకీ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాను. కానీ సినిమా చూసిన తర్వాత చాలా నిరాశకు గురయ్యాను. విక్కీ కౌశల్ బాగా నటించాడు. ఈ సినిమాకు 2 స్టార్స్ రేటింగ్ ఇస్తాన”ని ఓ అభిమాని మీడియాతో చెప్పాడు.

Also Read: ‘డంకీ’ మూవీ రివ్యూ.. నవ్వించి.. ఏడిపించేసిన షారుఖ్ ఖాన్..

షారూఖ్‌ ఫ్యాన్స్ సందడి
మరోవైపు ‘డంకీ’ థియేటర్ల వద్ద షారూఖ్‌ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. టపాకులు కాలుస్తూ, డాన్సులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వుయ్ లవ్ షారూఖ్ అంటూ నినదిస్తున్నారు. షారూఖ్‌ హ్యాట్రిక్ హిట్ కొట్టాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఫ్యాన్స్ చెప్పినట్టుగా షారూఖ్‌ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా, లేదా అనేది రెండుమూడు రోజుల్లో తేలిపోతుందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

Also Read : Salaar Movie : 300 కోట్లు.. 120 రోజులు షూట్.. 15 ఏళ్ళ క్రితం కథ.. ఇంకా ఎన్నో.. సలార్ విశేషాలు ఇవే