Salaar Movie : 300 కోట్లు.. 120 రోజులు షూట్.. 15 ఏళ్ళ క్రితం కథ.. ఇంకా ఎన్నో.. సలార్ విశేషాలు ఇవే
రేపు విడుదల అవుతున్న ప్రభాస్ సలార్ సినిమా గురించి బోలెడన్ని విశేషాలు..

Prashanth Neel Prabhas Salaar Movie Interesting Facts
Salaar Movie : ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా part 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. KGF లాంటి భారీ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా అనగానే అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు మూడేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సలార్ రేపు థియేటర్స్ లో సందడి చేయనుంది.
సలార్ సినిమా గురించి మరిన్ని విశేషాలు..
సలార్ సినిమాని 2020 అక్టోబర్ లో ప్రకటించారు. కరోనా వల్ల, స్టార్స్ డేట్లు సర్దుబాటు లాంటి అనేక సమస్యలతో వాయిదా పడుతూ వస్తూ మూడేళ్ళ తర్వాత ఇప్పుడు సినిమా రిలీజవుతుంది.
ఈ సినిమాకి 300 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. ఇక థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 405 కోట్ల వరకు అయింది.
సలార్ సినిమాని 120 రోజుల పాటు షూటింగ్ చేశారు.
సలార్ లో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లు మెయిన్ లీడ్స్ చేస్తుండగా జగపతి బాబు, శ్రియ రెడ్డి, శృతి హాసన్, బాబీ సింహ, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు.. లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు.
ఈ సినిమాని గోదావరిఖని దగ్గర బొగ్గు గనుల్లో, రామోజీ ఫిలిం సిటీలో, మరి కొన్ని ప్రదేశాల్లో షూట్ చేశారు.
సలార్ కోసం ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు.
ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం కథని కొంచెం మార్చి, కథని పెంచి భారీ బడ్జెట్ తో సలార్ తెరకెక్కించారు.
Also Read : ‘సలార్’ని ఆ థియేటర్స్‌లో రిలీజ్ చేయడం లేదా.. షారుఖ్ వెర్సస్ ప్రభాస్..
సలార్ స్క్రిప్ట్ పూర్తయ్యాక చూసుకుంటే ఆరు గంటల సినిమా వస్తుంది అనిపించడంతో రెండు పార్టులుగా తీసుకొస్తున్నారు.
సలార్ సినిమాకి ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే రిలీజ్ చేశారు.
సలార్ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
అమెరికాలో రిలీజ్ కి ముందే ఏకంగా 1.8 మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తో కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ కి ముందే ఆన్లైన్ లో కాకుండా థియేటర్స్ వద్ద బుకింగ్స్ ఓపెన్ చేసి అభిమానులను థియేటర్స్ బయట బారులు తీరేలా చేశారు.
ఇక ఈ సినిమా ప్రశాంత్ నీల్ కెరీర్ మొదలైన సమయంలోనే రాసుకున్నారట. అంటే దాదాపు 15 ఏళ్ళ క్రితమే ఈ కథ పుట్టింది.
ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేసారని టాక్ వినిపిస్తుంది.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కి రాకపోవడంతో అభిమానుల ఆకలి ఈ సినిమా తీరుస్తుందని, 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.
Also Read : రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?