Tollywood : డైరెక్టర్స్ ను టార్గెట్ చేస్తున్న ఫ్యాన్స్
మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్లో (Tollywood) ఫ్యానిజం వేరే లెవల్.
Fans Trolling the Star Directors
Tollywood : మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్లో ఫ్యానిజం వేరే లెవల్. హిట్ వస్తే ఎంతలా తలమీద పెట్టుకుంటారో.. తమ అభిమాన హీరోకు ఫెయిల్ వస్తే డైరెక్టర్‌ను అదే రేంజ్లో ఆడుకుంటారు. చాలామంది విషయంలో అదే ప్రూవ్ అయింది. తమ అభిమాన హీరోకు సరైన హిట్ ఇవ్వలేదనే కారణంతో డైరెక్టర్లపై.. ఫ్యాన్స్ తీరు ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్ అవుతోంది. దీంతో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిన సంతోషానికి మించి.. ఆ హీరో ఫ్యాన్స్ ఊహించిన లెవల్ హిట్ ఇవ్వకపోతే జరిగే ట్రోలింగ్, బ్యాక్లాష్ తలుచుకొని డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
స్టార్ హీరోల సినిమాలపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉంటున్నాయ్. ఆ సినిమా ఫలితం తేడా వస్తే.. ఫ్యాన్స్ చేసే హడావుడితో డైరెక్టర్ కెరీర్‌పైనే ఎఫెక్ట్ పడుతోంది. నటసింహం బాలయ్యకు మంచి హిట్స్ ఇచ్చిన రికార్డు ఉంది బోయపాటి శ్రీనుకి ! దీంతో అఖండ 2 మీద ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
Sravanthi Chokarapu : గ్రీన్ కలర్ లెహంగాలో యాంకరమ్మ.. అందాలతో మెస్మరైజ్ చేసిన స్రవంతి
ఐతే ఆ రేంజ్లో ఆ మూవీ హిట్ కాలేదు. దీంతో బోయపాటిని సోషల్‌మీడియాలో ట్రోల్ చేశారు. సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్తో ప్రభాస్‌కు భారీ హిట్ ఊహించిన ఫ్యాన్స్.. రిజల్ట్ తేడా కొట్టడంతో డిజప్పాయింట్ అయ్యారు. డైరెక్టర్ మారుతిని ఆడుకోవడం మొదలుపెట్టారు.
ట్రోలింగ్ మాత్రమే కాదు.. లిమిట్ దాటేసి వేధించడం మొదలుపెట్టారు ఒకరకంగా ! ఇక ఇప్పుడు ఫ్యాన్స్ టార్గెట్లోకి హరీష్ శంకర్ వచ్చేశాడు. ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి ముందు హరీష్ శంకర్ చుట్టూ కూడా ఇదే చర్చ జరిగింది. ఫైనల్ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది.. ఫ్యాన్స్ ఎలా ఉంటారని ! ఇలా స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రెషర్.. డైరెక్టర్లను ఇబ్బంది పెడుతోంది. హిట్ ఇస్తే సూపర్.. మిస్ అయితే టార్గెట్ ! ఇదో ట్రెండ్ అయిపోయిందంటూ డైరెక్టర్లు ఫీల్ అవుతున్నారట.
