Movie Tickets : ఫిలిం ఛాంబర్ ప్రెస్‌మీట్.. ఏపీలో సస్పెండ్ అయిన జీవో 35 రేట్లతో టికెట్లు అమ్మమనడం దారుణం..

ప్రెస్ మీట్‌లో నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. ''నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టటానికి కారణం పాత జీవో, సస్పెండ్ అయిన జీవో 35 ప్రకారం ఉన్న రేట్లతో సినిమా టికెట్లు..

Movie Tickets : ఫిలిం ఛాంబర్ ప్రెస్‌మీట్.. ఏపీలో సస్పెండ్ అయిన జీవో 35 రేట్లతో టికెట్లు అమ్మమనడం దారుణం..

Natti

Updated On : February 24, 2022 / 4:19 PM IST

Movie Ticket Rates Issue :  ఒకపక్క తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పించారు. అంతే కాక అయిదవ షోలకి కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. మరో పక్క ఏపీలో మాత్రం పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. ఏపీ ప్ర్రభుత్వంతో సినీ పెద్దలు ఎన్ని మీటింగ్స్ నిర్వహించినా ఉపయోగం లేకుండా పోతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ ఉండటంతో ఎవరైనా టికెట్స్ చెప్పిన రేట్లకి కాకుండా ఎక్కువ అమ్మినా, బెనిఫిట్ షోలు వేసినా తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.

సినీ పెద్దలు కలిసినప్పుడు మాత్రం అన్నిటికి ఓకే చెప్పి, త్వరలో కొత్త జీవోలు వస్తాయని చెప్పి, ఏపీలో సినీ పరిశ్రమ కళకళలాడుతుంది చెప్పి వారు వెళ్ళిపోయినా తర్వాత అదే పాత చింతకాయ పచ్చడి అన్నట్టు వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం. అందునా పవన్ సినిమా అంటే ఇంకా ఎక్కువగా ద్రుష్టి పెడుతుంది థియేటర్ల మీద. దీంతో తాజాగా ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఓ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ అనంతరం ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.

Movie Shootings : షూటింగ్స్‌కి స్వర్గధామం.. యుక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమాలు..

ప్రెస్ మీట్‌లో నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. ”నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టటానికి కారణం పాత జీవో, సస్పెండ్ అయిన జీవో 35 ప్రకారం ఉన్న రేట్లతో సినిమా టికెట్లు అమ్మమని రెవిన్యూ వారు ఎగ్జిబిటర్స్ ను బెదిరిస్తున్నారు. దీనిపై భరోసా ఇవ్వాల్సిన భాద్యత ఫిలిం ఛాంబర్ కు ఉంది. మేము ఏపి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తనిఖిలు చేయటం తప్పుకాదు. కానీ సస్పెండ్ అయిన జీవో రేట్లకు అమ్మమనటం తప్పు. ఏ థియేటర్స్ వారిని అన్ అఫీషియల్ గా కూడా ఇబ్బంది‌పెట్టొదని మనవి. జగన్ గారు ఈ విషయంపై అందరి‌ అధికారులకు మీరు క్లారిటి ఇవ్వాలని కోరుతున్నాం. సినిమాను సినిమాలానే చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తనీఖులు చేసి లెసెన్స్ లేకపోతే, బ్లాక్ మార్కెట్ పై సీరియస్ యాక్షన్ తీసుకొండి కానీ ఇలా సిఎం జగన్ గారికి తెలియకుండా కొందరు అధికారులు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికే ఇబ్బంది అవుతుంది. ఎగ్జిబిటర్ లపై బెదిరింపులకు పాల్పడితే న్యాయపరమైన చర్యలకు వెళతారు. కొత్త రేట్లని అమలు చేయాలని కోరుతున్నాం. అలానే తెలంగాణ ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు. ఏపి ప్రభుత్వం కూడా మాకు భరోసా ఇస్తారని ఆశిస్తున్నాం.” అని తెలిపారు.

Pawan kalyan : బిల్ గేట్స్‌తో మీటింగ్ ఉన్నా కూడా వచ్చిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు

నిర్మాత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ”టెలివిజన్ లేని రోజుల రేట్లకు సినిమాలు చూడమనడం భావ్యం‌కాదు. ఎక్కడైనా కరెంటు, ప్రెట్రోలు రేటు ఒక్కటే ఉంది. ఏ సెంటర్ లోనైనా ఒకటే సినిమా టికెట్ రేటు ఉండాలి. ఆడియెన్స్ లగ్జరీగా సినిమా చూడాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం నిర్మాతలకు కమిటిలో అవకాశం ఇవ్వాలి. హీరోలతో కావాలంటే మీరు ఫోటోలు దిగండి” అని తెలిపారు.

Pawan Kalyan : ‘గాడ్ ఫాదర్’తో ‘భీమ్లా నాయక్’.. ఒకరికోసం ఒకరు

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ”జీవో 35ను కోర్టు పక్కన పెట్టింది. టికెట్ రేట్లపై ఓ కమిటి కూడా వేయటం జరిగింది. సినీ ప్రముఖులు జగన్ ను మీట్ అయ్యారు. త్వరలో కొత్త జీవో ఇస్తామని చెప్పారు. అయినా జీవో 35నే అమలు చేయటం ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వానికి మా విన్నపం. జీవో 35ను అమలు చేయ్యెద్దు. సినిమా వారు రకరకాల పార్టీల్లో ఉంటారు. మాపై రాజకీయాలు చెయ్యెద్దని కోరుతున్నాం. లక్షలాది కుటుంబాలు సినిమాలపై ఆదారపడి ఉన్నాయి. రాజ్యాంగబద్దంగా వెళ్లాలని అధికారులను అదేశించాలి. మీనుండి కొత్త జీవో వచ్చేవరకైనా వైఎస్ఆర్ గారి జీవో 100ను కనీసం అమలుపరచండి. రెండువారాల పాటు టికెట్ రేట్లను 75 శాతం పెంచుకునే వెసులుబాటును అయినా కల్పించండి.” అని తెలిపారు.