Rajasekhar: బైకర్ మూవీ సక్సెస్ లో రాజశేఖర్.. శుబాకాంక్షలు తెలిపిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
బైకర్ మూవీ సక్సెస్ సాధించిన సందర్బంగా నటుడు రాజశేఖర్(Rajasekhar) ను కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్.
Film Critics Association Extends Wishes to Rajasekhar on the success of Biker movie
Rajasekhar: ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తన 60 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్” సన్నాహాల్లో భాగంగా ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్(Rajasekhar)ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆయన నటించిన “బైకర్” చిత్రం సాధించిన విజయానికి అసోసియేషన్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. రాజశేఖర్ సీనియర్ జర్నలిస్టులతో తన కెరీర్ లోని అంకుశం, తలంబ్రాలు, మగాడు వంటి క్లాసిక్ సినిమాల జ్ఞాపకాలను ఎంతో ఆత్మీయంగా పంచుకున్నారు.
Diamond Dacoit Review: ‘డైమండ్ డెకాయిట్’ మూవీ రివ్యూ.. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
అంతేకాకుండా, తాను ప్రస్తుతం నటిస్తున్న రెండు నూతన చిత్రాల విశేషాలను కూడా రాజశేఖర్ వారితో చర్చించారు. ఈ భేటీలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటితో పాటు కార్యవర్గ సభ్యులు బాల్ రెడ్డి, మోహన్ గోటేటి, గిరిధర్, ధీరజ అప్పాజీ, జిల్లా సురేష్ పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టులతో జరిగిన ఈ సమావేశం ఎంతో ఆత్మీయ వాతావరణంలో సాగింది.
