Cancer Actress: క్యాన్సర్‌ను ఎదుర్కొని హీరోయిజాన్ని చూపిస్తున్న హీరోయిన్లు!

సమస్యలకు హీరో, హీరోయిన్ అన్న తేడా లేదు. సినిమాలో గ్లామర్ తో అలరించిన హీరోయిన్లు.. రియల్ లైఫ్ లో ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతున్నారు. ఎప్పుడూ అందంగా కనిపించే హీరోయిన్..

Cancer Actress: క్యాన్సర్‌ను ఎదుర్కొని హీరోయిజాన్ని చూపిస్తున్న హీరోయిన్లు!

Cancer Actress

Updated On : December 21, 2021 / 11:05 AM IST

Cancer Actress: సమస్యలకు హీరో, హీరోయిన్ అన్న తేడా లేదు. సినిమాలో గ్లామర్ తో అలరించిన హీరోయిన్లు.. రియల్ లైఫ్ లో ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతున్నారు. ఎప్పుడూ అందంగా కనిపించే హీరోయిన్.. అదిరిపోయే వార్తతో ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. సౌత్ లో హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసిన హంసానందిని క్యాన్సర్ వచ్చిందటూ షాకింగ్ న్యూస్ చెప్పింది.

Pushpa: వీకెండ్ పోయినా తగ్గేదేలే.. నాలుగో రోజు పుష్పరాజ్ భారీ వసూళ్లు

క్రేజీ సాంగ్స్ తో తెలుగు ఆడియన్స్ ని హీటెక్కించిన బ్యూటీ హంసానందిని ఫాన్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది. 4 నెలలనుంచి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు.. ఆల్రెడీ సర్జరీతో పాటు కీమోథెరపీలు కూడా చేయించుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హంసానందిని. జెనటికల్ క్యాన్సర్ వస్తుందేమో అన్న తన భయం నిజమైందని అయినా.. క్యాన్సర్ ను జయిస్తానన్న కాన్ఫిడెన్స్ తో పాజిటివ్ గా పోరాడుతోంది హంసానందిని. ఈ భామ.. సౌత్ లో సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ తో ఆడియన్స్ కి దగ్గరైంది.

Bheemla Nayak: వెనక్కు తగ్గిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరికి వాయిదా!

హంసానందినే కాదు.. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక అంటూ తెలుగు ప్రేక్షకులు వెతికిన అందాల భామ సోనాలిబేంద్రే కూడా అప్పట్లో అభిమానులకు షాక్‌ ఇచ్చింది. హై గ్రేడ్‌ క్యాన్సర్‌ తో బాధపడుతూ అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుని క్యాన్సర్ పై ఇప్పుడు అవేర్ నెస్ ప్రోగ్సామ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ హీరోయిన్ గా మనిషాను చూసిన ప్రేక్షకులు కొంత కాలం తర్వాత నున్నని గుండుతో, పీక్కుపోయిన ముఖంతో ఉన్న ఫొటోలను చూసి షాక్‌ తిన్నారు. ఒకప్పటి అందాల భామ మనీషా.. ఓవెరీన్‌ క్యాన్సర్‌ బారినపడి మూడేళ్ల పోరాటం తర్వాత కోలుకున్నారు.

RRR : అమెరికాలో అప్పుడే కలెక్షన్స్ వేట మొదలుపెట్టిన ‘ఆర్ఆర్ఆర్’

క్యాన్సర్‌ పోరాటంలో గెలిచిన మరో అందాల భామ లిసారే. ఎటోబైకోక్‌ అనే రేర్ క్యాన్సర్‌కి గురైన లిసారే స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ తర్వాత 2010లో తాను క్యాన్సర్‌ నుంచి కోలుకుంది. కానీ ఆమెకు సోకిన క్యాన్సర్‌ పూర్తిగా తగ్గేది కాదు కాబట్టి.. జీవితాంతం లీసారే పోరాటం కొనసాగించాల్సిందే. సౌత్ సినీ జనాలకు సుపరిచితురాలైన గౌతమి కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. క్యాన్సర్‌ కారణంగా తన పడ్డ ఇబ్బందులు ఇతరులకు ఎదురు కాకూడదంటూ ప్రస్తుతం క్యాన్స్‌ ఎవేర్‌నెస్‌ క్యాంపెయిన్లు చేస్తున్నారు.

Radhe Shyam: హైదరాబాద్‌లోనే రాధేశ్యామ్ నేషనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు.. మరిన్ని ఆశలతో ముందుకు దూసుకుపోతున్నప్పుడు, ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే.. ఇంకెవరైనా అయితే కుప్పకూలిపోయేవారేమో కాని మన నటి మమతా మోహన్‌దాస్‌ మాత్రం చావుని గెలిచింది. ఎంతో ధైర్యంగా క్యాన్సర్ ని గెలిచి కెరీర్ ని మళ్లీ బిల్డప్ చేసుకునే పనిలో ఉంది. ఇలా గ్లామర్ వరల్డ్ లో జస్ట్ హీరోయిన్స్ కానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా కష్టాల్ని ఎదుర్కొంటూ తమహీరోయిజాన్ని చూపిస్తున్నారు హీరోయిన్లు.