Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్

ఇటీవల తమిళ్ హీరో విష్ణు విశాల్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు రవితేజ. త్వరలో ఓ న్యూస్ ఉండబోతుందని పోస్ట్ చేశారు. తాజాగా తమిళ్ హీరో విష్ణు విశాల్ సినిమా 'ఎఫ్ఐఆర్' (FIR) రిలీజ్...

Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్

Raviteja

Updated On : February 4, 2022 / 7:55 AM IST

Vishnu Vishal :  టాలీవుడ్ మాస్ మహారాజ ర‌వితేజ ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. వేరే నిర్మాతలతో కలిసి తాను చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలకి రవితేజ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిర్మాతగా మారడమే కాకుండా ఇప్పుడు సినిమాలని రిలీజ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు మాస్ మహారాజ.

 

ఇటీవల తమిళ్ హీరో విష్ణు విశాల్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు రవితేజ. త్వరలో ఓ న్యూస్ ఉండబోతుందని పోస్ట్ చేశారు. తాజాగా తమిళ్ హీరో విష్ణు విశాల్ సినిమా ‘ఎఫ్ఐఆర్’ (FIR) రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాని మ‌ను ఆనంద్ తెరకెక్కిస్తుండగా హీరో విష్ణు విశాల్ తో పాటు అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా కలిసి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను కూడా విడుదల చేశారు. టెర్రరిస్ట్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Mouni Roy : మ‌ల‌యాళీ, బెంగాలీ.. రెండు పద్ధతుల్లో మౌనిరాయ్ వివాహం.. వీడియో రిలీజ్

ఈ సినిమాని తెలుగులో రవితేజ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లో కూడా మాస్ మహారాజ్ రవితేజ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని వేశారు. ఈ సినిమా నిర్మాతలు రవితేజతో ‘రావణాసుర’ సినిమా చేస్తుండటంతో ఆ స్నేహంతోనే FIR సినిమాని తెలుగులో రవితేజ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు. FIR సినిమా ఫిబ్ర‌వ‌రి 11న తెలుగు, తమిళ్ లో విడుద‌ల కానుంది.