Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న 'కన్నప్ప' మూవీ నుంచి మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

First look poster released from Manchu Vishnu Kannappa Movie
Kannappa : మంచు విష్ణు హీరోగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి శివ క్షేత్రం హిస్టరీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాని హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విజువల్ వండర్ గా రూపొందించబోతున్నారు. కాగా నేడు మహాశివరాత్రి పర్వదినం కావడంతో.. చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.
Also read : Ajith Kumar : హాస్పిటల్‌లో తమిళ్ హీరో అజిత్.. ఫ్యాన్స్ టెన్షన్.. అసలు ఏమైంది..!
ఈ పోస్టర్ లో మంచు విష్ణు.. బాణం, విల్లు ధరించి వారియర్ గా మాసివ్ లుక్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ అయితే ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ మూవీ మేజర్ టాకీ పార్ట్ మొత్తం న్యూజిలాండ్ అడవుల్లోనే సాగుతుంది. ఇప్పటికే అక్కడ 90 రోజుల మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సినిమా.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం అక్కడికి చేరుకుంది. ఈ షెడ్యూల్ కూడా ఎక్కువ రోజులే ఉండనుంది.
View this post on Instagram
కాగా ఈ మూవీలో హీరోయిన్ గా ప్రీతి ముఖుంధన్ నటిస్తుంటే ప్రభాస్, మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. వంటి భారీ స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారట. పార్వతీ దేవిగా నయనతార నటించబోతున్నారని తెలుస్తుంది.