Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టించిన సినిమా గాండీవ‌ధారి అర్జున. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌కుడు.

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Gandeevadhari Arjuna OTT Release

Gandeevadhari Arjuna OTT Release : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టించిన సినిమా గాండీవ‌ధారి అర్జున. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌కుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వ‌రుణ్ తేజ్ బాడీగార్డుగా క‌నిపించాడు. నాజ‌ర్‌, విమ‌లా రామ‌న్‌, విన‌య్ రాయ్‌లు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ ద‌క్కించుకుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేయ‌నుంది అనే విష‌యాన్ని తాజాగా నెట్‌ప్లిక్స్ వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ 24న స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ విష‌యాన్ని ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ‘సెప్టెంబరు 24న వ‌చ్చేది గాండీవధారి అర్జున సినిమానే కాదు ఓ ఏజెంట్‌ తెచ్చే ధైర్యం కూడా’ అని తెలిపింది.

రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న వ‌రుణ్ తేజ్‌

వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో మాజీ ప్ర‌పంచ సుంద‌రి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో వ‌రుణ్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లోని జెట్ ఫైట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘మట్కా’. ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన నోరా ఫతేహి , మీనాక్షి చౌదరి లు న‌టిస్తున్నారు.

Salaar : నవంబర్‌లో రాబోతున్న సలార్.. రిలీజ్ డేట్ వైరల్..!