గౌతమ్ పోస్ట్‌కు కాజల్ ఫిదా!

  • Published By: sekhar ,Published On : October 14, 2020 / 06:14 PM IST
గౌతమ్ పోస్ట్‌కు కాజల్ ఫిదా!

Updated On : October 14, 2020 / 6:28 PM IST

Kajal Aggarwal – Gautam Kitchlu: స్టార్ హీరోయిన్‌ Kajal Aggarwal త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన యంగ్ బిజినెస్‌మెన్ Gautam Kitchlu ను ఈ నెల 30న వివాహం చేసుకోబోతోంది. కాజల్ బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తాజాగా నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటోను తన ఇంట్లో అలంకరించి దానిని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కాజల్ కు కాబోయే భర్త గౌతమ్. కాగా ఆ ఫొటో వెనకాల ఉన్న బెలూన్ డిజైనింగ్ అందరినీ ఆకట్టుకుంది. కాజల్ కూడా ఆ డిజైనింగ్‌కు ఫిదా అయింది.


ఆ పోస్ట్‌కు ‘ఇది కూడా డిజైన్ అంశాన్ని ప్రతిబింబిస్తోంది. కళాత్మక హృదయం ఉన్న నా ఫియాన్సీ’ అని కామెంట్ చేసింది కాజల్. గౌతమ్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనే సంగతి తెలిసిందే. వారి కుటుంబం కొన్ని దశాబ్దాలుగా వ్యాపార రంగంలో కొనసాగుతోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ వివాహ వేడుక జరుగనుంది.

https://www.instagram.com/p/CGP8pt7ACM1/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CGALke3BQQY/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CGBrf9PhyV3/?utm_source=ig_web_copy_link