తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం.. హ్యాపీ బర్త్‌డే ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని..

  • Published By: sekhar ,Published On : August 31, 2020 / 11:56 AM IST
తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం.. హ్యాపీ బర్త్‌డే ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని..

Updated On : August 31, 2020 / 12:35 PM IST

Happy Birthday Gautham Ghattamaneni: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు త‌న‌యుడు గౌత‌మ్ ఘ‌ట్ట‌మ‌నేని పుట్టిన‌రోజు నేడు(ఆగ‌స్ట్ 31). ఈ సంద‌ర్భంగా గౌత‌మ్‌కి మ‌హేష్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్, సితార బ‌ర్త్‌డే విషెష్ తెలిపారు.



‘‘14లోకి అడుగుపెట్టిన గౌత‌మ్‌కి పుట్టిన‌రోజు అభినంద‌న‌లు. ఓ మంచి యువ‌కుడిగా నువ్వు పెరిగి పెద్ద‌వుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డొరేమాన్ టు అపెక్స్ లెజెండ్ వ‌ర‌కు నీతో క‌లిసి నేను జ‌ర్నీ చేయ‌డం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టిన‌రోజు కావాలి..హ్యాపీ బ‌ర్త్‌డే’’ అంటూ తనయుడి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ మహేష్ ట్వీట్ ట్వీట్ చేశారు.
https://10tv.in/who-warns-of-risk-of-young-infecting-the-old/
‘‘గౌతమ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. తల్లిదండ్రులమయ్యామనే అనుభూతితోపాటు సంతోషం, ప్రేమను మా జీవితాల్లోకి తీసుకొచ్చాడు. తను ఈ ఏడాది 14 వ‌సంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలాగే ప్ర‌తి ఏడాది త‌న జీవితంలో ప్రేమ‌, సంతోషం పెరుగుతూ రావాలి. నా ప్రియ‌మైన త‌న‌యుడికి హ్యాపీ బ‌ర్త్‌డే’’ అని న‌మ్ర‌తా శిరోద్క‌ర్ అభినంద‌న‌లు తెలిపారు.



‘‘హ్యాపీ బర్త్ డే అన్నయ్య.. మరో ప్రత్యేకమైన రోజు. క్రైమ్‌లో నాతో క‌లిసి ఉండేవాడు. కానీ.. మొద‌ట దొరికిపోయేది త‌నే. నా సోద‌రుడిగా ఉన్నందుకు థ్యాంక్స్‌. హ్యాపీ బ‌ర్త్‌డే’’ అని సితార గౌత‌మ్‌కి బ‌ర్త్‌డే విషెష్ తెలిపారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన వారు, మహేష్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

https://www.instagram.com/p/CEhgogcj10a/?utm_source=ig_web_copy_link