Gopichand Malineni: వీరయ్యతో చేతులు కలుపుతున్న వీరసింహారెడ్డి డైరెక్టర్..?
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా మలిచాడు గోపీచంద్. ఇక ఈ సినిమా సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేసేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు. అయితే తన నెక్ట్స్ చిత్రాన్ని గోపీచంద్ ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Gopichand Malineni To Direct Megastar Chiranjeevi
Gopichand Malineni: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా మలిచాడు గోపీచంద్. ఇక ఈ సినిమా సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేసేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు. అయితే తన నెక్ట్స్ చిత్రాన్ని గోపీచంద్ ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
గతంలో మాస్ రాజా రవితేజతో మరోసారి గోపీచంద్ చేతులు కలుపుతాడనే వార్త చక్కర్లు కొట్టింది. కానీ, గోపీచంద్ మెగా ప్లాన్‌తో దూసుకెళ్తున్నాడట. ఇప్పటికే ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట ఈ డైరెక్టర్. ఈ కథను ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి వినిపించాడట. అయితే స్టోరీలైన్ విన్న మెగాస్టార్ కథ నచ్చడంతో గోపీచంద్‌కు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో తన నెక్ట్స్ చిత్రాన్ని మెగాస్టార్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.
Gopichand Malineni : బాలకృష్ణకి డైరెక్టర్ మొదట వినిపించింది వీరసింహారెడ్డి స్టోరీ కాదట..
ఇక సంక్రాంతి బరిలో గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’కి పోటీగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి. అయితే చిరు ప్రస్తుతం భోళాశంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని వెంకీ కుడుములతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. మరి గోపీచంద్ మలినేనికి చిరు ఎప్పుడు టైమ్ ఇస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.