Gopichand Malineni : బాలకృష్ణకి డైరెక్టర్ మొదట వినిపించింది వీరసింహారెడ్డి స్టోరీ కాదట..

బాలకృష్ణ ఈ కథ అసలు ఎలా వచ్చింది, నా దగ్గరికి ముందు వేరే కథ తీసుకువచ్చావు కదా అని డైరెక్టర్ ని అడిగాడు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. మొదట మీ దగ్గరికి వన్ డేలో జరిగే స్టోరీని తీసుకొచ్చాను. ఆ కథ బాగానే ఉన్నా ఇంకా................

Gopichand Malineni : బాలకృష్ణకి డైరెక్టర్ మొదట వినిపించింది వీరసింహారెడ్డి స్టోరీ కాదట..

Gopichand Malineni said another story to balakrishna before veerasimhareddy

Gopichand Malineni :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2 ఆహా ఓటీటీలో సాగుతుండగా ఇటీవలే ప్రభాస్, గోపీచంద్ తో కలిసి బాహుబలి ఎపిసోడ్స్ అంటూ రెండు ఎపిసోడ్స్ ని స్ట్రీమ్ చేయగా వీటికి బాగా రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పటికే పలు ఎపిసోడ్స్ అవ్వగా తాజాగా వీరసింహారెడ్డి చిత్రయూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వీరసింహారెడ్డి సినిమా యూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, రచయిత సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ షోకి వచ్చి బాలయ్యతో కలిసి అలరించారు.

Balakrishna : వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి పల్నాటి యుద్ధం సినిమా చేస్తానన్న బాలయ్య..

ఈ షోలో బాలకృష్ణ ఈ కథ అసలు ఎలా వచ్చింది, నా దగ్గరికి ముందు వేరే కథ తీసుకువచ్చావు కదా అని డైరెక్టర్ ని అడిగాడు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. మొదట మీ దగ్గరికి వన్ డేలో జరిగే స్టోరీని తీసుకొచ్చాను. ఆ కథ బాగానే ఉన్నా ఇంకా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ చేద్దామన్నారు మీరే. ఆ తర్వాత
ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకోని ఆ పాయింట్ నిర్మాత రవి గారికి చెప్తే మీకు చెప్పమని పంపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ చెప్పాను మీకు ఫస్ట్. ఆ పాయింట్ మీకు నచ్చి నా మీద నమ్మకంతో ప్రొసీడ్ అవ్వమన్నారు అని తెలిపాడు. దీంతో గోపీచంద్ బాలకృష్ణకి మొదట వినిపించింది ఈ కథ కాదా అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. మొత్తానికి బాలయ్యకి సూట్ అయ్యే ఫ్యాక్షన్ కథని తీసుకొచ్చి దానికి కొన్ని ట్విస్టులు కలిపి హిట్టు కొట్టాడు డైరెక్టర్.