Chiranjeevi-Allu Arjun : చిరు, బన్నీ కాంబినేషన్‎లో భారీ మూవీ!

చిరు, బన్నీ కాంబినేషన్‌లో మూవీ రాబోతుందని అంటున్నారు.

Chiranjeevi-Allu Arjun : చిరు, బన్నీ కాంబినేషన్‎లో భారీ మూవీ!

Gossip Garage Allu Arjun to produce film with Chiru as hero

Updated On : June 13, 2025 / 5:35 PM IST

ఆరు పదుల వయస్సులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఓ వైపు విశ్వంభర VFX మేకింగ్ నడుస్తుండగానే.. మరోవైపు అనిల్‌ రావిపూడితో ఓ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ మూవీ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక పుష్పతో పాన్‌ ఇండియా స్టార్ అయిపోయిన అల్లుఅర్జున్.. తన నెక్ట్స్ లెవెల్ కెరీర్‌పై గట్టి ఫోకసే పెట్టాడు. డైరెక్టర్ అట్లీతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. ఇలా ఎవరి మూవీస్‌లో వారు బిజీగా ఉండగానే.. చిరు, బన్నీ కాంబినేషన్‌లో మూవీ రాబోతుందని అంటున్నారు.

అల్లు అర్జున్‌ నిర్మాతగా చిరు హీరోగా సినిమాకు ప్లాన్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్‌ బ్యానర్ పైనే ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా ఒక ప్రముఖ తమిళ డైరెక్టర్‌ను ఎంపిక చేసినట్లు టాక్. అయితే ఆ దర్శకుడు ఎవరన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. కొందరు ఈ మూవీ ఒక యాక్షన్ డ్రామా అని అంటున్నారు. మరికొందరు చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా సామాజిక సందేశంతో కూడిన కథాంశం కావొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Sunjay Kapoor : హీరోయిన్ మాజీ భర్త మరణం.. తేనెటీగ మింగితే అది కుట్టి హార్ట్ ఎటాక్ వచ్చిందట..

ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్ నిర్మాతగా అడుగుపెట్టే తొలి ప్రాజెక్ట్ కావడంతో, అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ విషయంపై గీతా ఆర్ట్స్ లేదా చిరంజీవి టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ గాసిప్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.