Gunasundari Katha : అక్టోబర్ 13న ‘గుణ సుందరి కథ’

సునీత సద్గురు, కార్తీక్ సాహస్, రేవంత్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం గుణ సుందరి కథ. మార్త క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Gunasundari Katha : అక్టోబర్ 13న ‘గుణ సుందరి కథ’

Gunasundari Katha

Gunasundari Katha release date : సునీత సద్గురు, కార్తీక్ సాహస్, రేవంత్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం గుణ సుందరి కథ. మార్త క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. నేటి సమాజంలో స్త్రీలు ఎదురుకుంటున్న సమస్యల నేపథ్యంలో సోషియో థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి ఓం ప్రకాష్ మార్త ద‌ర్శ‌కుడు, నిర్మాత‌. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దర్శకుడు ఓం ప్రకాష్ మార్త మాట్లాడుతూ.. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న‌ట్లు తెలిపారు. సెన్సార్ బృందం చిత్ర బృందాన్ని అభినందించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్న నటినటులతో చేసిన ఈ ప్రయత్నం అందరికి మంచి పేరు, గుర్తింపు తెస్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంద‌న్నారు. ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరారు.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి అమితాబ్ లుక్ రిలీజ్..

ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఇందులోని మాటలు అందరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి.