Guntur Kaaram : గెట్ రెడీ మహేష్ ఫ్యాన్స్.. బర్త్ డేకి బాబు ల్యాండ్ అవ్వబోతున్నాడు..

మహేష్ బాబు బర్త్ డేకి గిఫ్ట్ ఉందా? లేదా? అని కొన్ని రోజులు నుంచి ఫ్యాన్స్ తెగ సతమతం అయ్యిపోతున్నారు. వారందరికీ గుడ్ న్యూస్.

Guntur Kaaram Update on the occasion of Mahesh Babu Birthday

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది.

Satya Teaser : సాయి ధరమ్ తేజ్ ఫీచర్ ఫిలిం ప్రోమో రిలీజ్.. ఆగష్టు 15న విడుదల..!

కాగా రేపు ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో మూవీ నుంచి ఏదొక అప్డేట్ వస్తుందని ఎంతో ఆసక్తి చూస్తున్నారు. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎటువంటి యాక్టివిటీ కనిపించకపోవడంతో అభిమానులు అంతా నిరాశ చెందారు. అయితే వారందరికీ హుషారుని ఇచ్చేలా మూవీ టీం ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి 12:06 నిమిషాలకు మూవీ నుంచి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అయితే అది ఏంటనేది తెలియజేయలేదు.

Director Siddique : ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

కొన్ని రోజులు నుంచి ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి సాంగ్ రిలీజ్ చేస్తారా? లేదా మరేదైనా? అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని శరేవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ చేసేందుకు మూవీ టీం గట్టిగా ప్రయత్నిస్తుంది. అయితే మూవీ షూటింగ్ కి పడుతున్న బ్రేక్స్ చూస్తుంటే.. సంక్రాంతి రిలీజ్ కష్టమని టాక్ వినిపిస్తుంది. మరి త్రివిక్రమ్ అండ్ మహేష్ ఏమి చేస్తారో చూడాలి.