యోగిబాబు : గూర్ఖా- టీజర్
కోలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు మెయిన్ లీడ్‌గా నటిస్తున్న గుర్ఖా మూవీ టీజర్ రిలీజ్..

కోలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు మెయిన్ లీడ్‌గా నటిస్తున్న గుర్ఖా మూవీ టీజర్ రిలీజ్..
కోలీవుడ్‌లో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు మెయిన్ లీడ్‌గా నటిస్తున్న సినిమా గుర్ఖా.. శ్యామ్ ఆంటోన్ డైరెక్ట్ చేస్తుండగా, 4 మంకీస్ స్టూడియో నిర్మిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. చెన్నైలోని ప్రముఖ మాల్‌ని తీవ్రవాదులు హైజాక్ చేస్తారు. మాల్‌లో ఉన్న జనాలందర్నీ బయటకి వెళ్ళకుండా నిర్భందిస్తారు.. పోలీసులు రంగంలోకి దిగుతారు. ఆ మాల్‌లో బాబు గూర్ఖాగా పని చేస్తుంటాడు.. అతనికి ఒక కుక్క తోడుగా ఉంటుంది. బాబు ఎలాంటి రిస్క్ తీసుకుని మాల్‌లో జనాలని సేవ్ చేసాడు? అనే కాన్సెప్ట్‌తో, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా గూర్ఖా.. యోగిబాబు చాలా బాగా పర్‌ఫార్మ్ చేసాడు. ఆనంద్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఎలీసా, మనోబాలా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలో గూర్ఖా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మ్యూజిక్ : రాజ్ ఆర్యన్, డీఓపీ : కృష్ణ వసంత్, ఎడిటింగ్ : రూబెన్, ఆర్ట్ : శివ శంకర్, ఫైట్స్ : పీసీ..
వాచ్ గూర్ఖా టీజర్..