జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించి, ‘ఆర్ఆర్ఆర్’ తో మన సినిమాను మరోమెట్టు ఎక్కించబోతున్న ఎస్.ఎస్.రాజమౌళి.. పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10)..

  • Published By: sekhar ,Published On : October 10, 2019 / 04:31 AM IST
జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు

Updated On : October 10, 2019 / 4:31 AM IST

తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించి, ‘ఆర్ఆర్ఆర్’ తో మన సినిమాను మరోమెట్టు ఎక్కించబోతున్న ఎస్.ఎస్.రాజమౌళి.. పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10)..

తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు.. తెలుగు సినిమాకి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన తెలుగు వాడు.. తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించి, ‘ఆర్ఆర్ఆర్’ తో మన సినిమాను మరోమెట్టు ఎక్కించబోతున్న ఎస్.ఎస్.రాజమౌళి.. పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10)..  

స్టూడెంట్ నెం:1తో దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేసి, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న,  ఈగ, బాహుబలి: ది బిగినింగ్,  బాహుబలి: ది కన్‌క్లూజన్ వరకూ అప్రతిహతంగా కొనసాగిన, కొనసాగుతున్న విజయ ప్రస్ధానం రాజమౌళిది. తెలుగు సినిమా పరిశ్రమలో ఫెయిల్యూర్ అనే పదం ఆయణ్ణి చూసి భయ పడుతుంది. బాహుబలి వంటి విజువల్ వండర్‌తో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా, తెలుగు ఇండస్ట్రీ కనీ వినీ ఎరుగని.. ఆ మాటకొస్తే దక్షిణాదిలో ఎవరికీ సాధ్యం కాని వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు.. దీంతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు, పద్మశ్రీ పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారు..

తను పని చేసే ప్రతీ హీరోకి కెరీర్ బెస్ట్ ఇవ్వడం ఒక్క జక్కన్నకే చెల్లింది.. రాని పని నేర్చుకోవడం, వచ్చిన పనికి ఎప్పటికప్పుడు సాన పెట్టుకోవడం (అప్‌డేట్) అవ్వడం.. కథలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎమోషన్ ఉండేలా చూసుకోవడం, జానర్ ఏదైనా కథకి తగ్గట్టు కయర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చెయ్యడం, చిన్న కథను కూడా బిగ్ కాన్వాస్ మీద చెప్పగలగడం, సినిమా తియ్యడం, దాన్ని మార్కెటింగ్ చెయ్యడం, జనాల్లోకి తీసుకెళ్లడం.. జక్కన్నకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనే విషయం అందరికీ తెలిసిందే.. మరో మగధీర తియ్యాలన్నా, బోలెడు బాహుబలులు తియ్యాలన్నా అది ఆయనతోనే సాధ్యం.. 

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్  రామ్ చరణ్‌లతో స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. తారక్‌ని కొమురం భీమ్‌గా, చరణ్‌‌ని అల్లూరి సీతారామరాజుగా చూపించనున్నాడు.. 2020 జూలై 30న ఈ సినిమా విడుదల కానుంది. తన మేధస్సుతో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని కోరుకుంటూ.. కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు..